Bread Gulab Jamun: బ్రెడ్ గులాబ్ జామూన్ ఇలా చేస్తే చాలు.. ఒక్క పీస్ కూడా మిగలదు?

గులాబ్ జామూన్.. ఈ పేరు వింటే చాలు నోరూరిపోతూ ఉంటుంది. ఈ గులాబ్ జామూన్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 22 Dec 2023 04 24 Pm 1966

Mixcollage 22 Dec 2023 04 24 Pm 1966

గులాబ్ జామూన్.. ఈ పేరు వింటే చాలు నోరూరిపోతూ ఉంటుంది. ఈ గులాబ్ జామూన్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే బయట మనం కొనుగోలు చేసే గులాబ్ జామున్ మనకు తినడానికి తక్కువ వచ్చి ఇంకా కావాలని అనుకుంటాం. కానీ డబ్బులు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా గులాబ్ జామున్ తినాలి అనుకుంటే ఇంట్లోనే సింపుల్ గా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే బ్రెడ్ గులాబ్ జామూన్ రెసిపీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెడ్ గులాబ్ జామూన్ కి కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసెస్ – 10
పంచదార – 1 1/2 కప్పు
చిక్కని పాలు – 1 కప్పు
ఏలకుల పొడి – కొద్దిగా
జీడిపప్పు – 2 స్పూన్స్
బాదం పప్పు – 2 స్పూన్స్

గులాబ్ జామూన్ తయారి విధానం:

బ్రెడ్ తో గులాబ్ జామూన్ చేసుకోటానికి ముందుగా పంచదారని పాకం పట్టాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పంచదార, నీళ్ళు పోసి కాస్తంత తీగపాకం వచ్చే దాకా మరిగించి, యాలకుల పొడి వేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ చుట్టురా ఉన్న అంచులని తీసేసి అన్ని ముక్కలని మిక్సిలో వేసి పొడి చెయ్యాలి. మెత్తగా పొడి అయిన బ్రెడ్ ముక్కల్లో చిక్కటి పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు చిక్కగా రావాలంటే 2 కప్పుల పాలను 1కప్పు అయ్యేలాగా మరిగించాలి. ఇలా తయారుచేసిన ముద్దని చిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనే వేసి అది కాస్త మరిగాక సిమ్ లో పెట్టి తయారు చేసుకున్న ఉండలని వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి. ఉండలు కూడా చల్లారాకా ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేస్తే చాలు తియ్యగా, మృదువుగా ఉండే గులాబ్ జామూన్ రెడీ అయిపోతుంది. అయితే పాకం చల్లారాకా ఉండలు వేయటం వల్ల అవి ముద్దగా ఊడిపోకుండా ఉంటాయి.

  Last Updated: 22 Dec 2023, 04:25 PM IST