Site icon HashtagU Telugu

Bread Chaat: పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్రెడ్ చాట్ ఈ విధంగా చేస్తే చాలు.. మళ్ళీ మళ్ళీ కావాలంటారు?

Mixcollage 21 Jan 2024 07 44 Pm 7174

Mixcollage 21 Jan 2024 07 44 Pm 7174

మామూలుగా సాయంత్రం అయితే చాలు ఏదైనా స్నాక్స్ తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడూ తినే ఒకే రకమైన సాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ సరికొత్త రెసిపీ మీ కోసమే. బెడ్ చాట్ ను ఇంట్లోనే సింపుల్ గా తయారు చేయండిలా.

బ్రెడ్‌ చాట్‌ కావలసిన పదార్థాలు

బ్రెడ్‌ – 1 ప్యాకెట్‌
బంగాళదుంప – 1 కప్పు
టమాటా ముక్కలు – అరకప్పు
ఉప్పు – సరిపడా
చాట్‌ మసాలా – స్పూన్‌
పచ్చి బఠాణీలు – అరకప్పు
ఉల్లిముక్కలు – అరకప్పు
చింతపండు గుజ్జు – స్పూన్‌
సన్న కారప్పూస – అరకప్పు
కారం – పావు స్పూన్‌
కొత్తిమీర – సరిపడా

తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా పచ్చి బఠాణీలు ఉడికించి అందులో పసుపు, ఉప్పు, కారం, చాట్‌ మసాలా, చింతపండు గుజ్జు కలిపి సరిపడా నీళ్లు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం మీద బ్రెడ్‌ ముక్కలు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వీటిమీద చాట్ పెట్టి, ఉల్లి ముక్కలు, సన్న కారప్పూస, కొత్తిమిర వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్‌ చాట్‌ రెడీ.