Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మనం తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మగవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోయాబీన్స్‌లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ప్రాథమికంగా మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు. వీటిని […]

Published By: HashtagU Telugu Desk
Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మనం తెలిసి తెలియక కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా మగవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోయాబీన్స్‌లో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు ప్రాథమికంగా మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు. వీటిని తీసుకోవడం వల్ల పురుషులకు హాని కలుగుతుంది.

ఈ ఫైటో ఈస్ట్రోజెన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. సోయాబీన్స్‌ను అతిగా తినడం వల్ల స్పెర్మ్ సాంద్రత కూడా బాగా తగ్గుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ పురుషులతో పాటు మహిళలు కూడా తినడం అంత మంచిది కాదు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, వేయించిన ఆహార పదార్థాలలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్‌ను తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా చాలా వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి క్రమంగా పురుషుల ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి.

ఈ విధంగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తింటే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అలాగే పురుగుల మందులు వాడని కూరగాయలు చాలా తక్కువగా లభిస్తాయి. పురుగుల మందుల రసాయనాలు, బిపిఎ జెనో ఈస్ట్రోజెన్ల లాగే పనిచేస్తాయి. జెనో ఈస్ట్రోజెన్లు, ఈస్ట్రోజెన్‌ను అనుకరించే రసాయనాలు. సోయాబీన్స్‌లో కనిపించే ఫైటో ఈస్ట్రోజెన్ల లాగానే జెనో ఈస్ట్రోజెన్లు కూడా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపుతాయి. అలాగే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు పురుషుల ఆరోగ్యానికి మంచివి కావు. కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, అంటే జున్ను, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల నాణ్యత లేని స్పెర్మ్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు మగవారిలో తలెత్తుతాయి.

  Last Updated: 16 Jun 2026, 12:43 PM IST