Site icon HashtagU Telugu

Bottle Gourd: ఒత్తిడి సమస్యల నుంచి బయటపడేసే సొరకాయ.. ఎలాగంటే?

Bottle Gourd

Bottle Gourd

మన వంటింట్లో ఉండే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ ను చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఇంకొందరు మాత్రం సొరకాయ కూర చేస్తే మాత్రం లొట్టలు వేసుకొని మరి తింటూ ఉంటారు. అయితే ఈ సొరకాయ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి శరీరంలో ఉన్న అధిక వేడిని బయటకు పంపిస్తుంది. కాగా సొరకాయలు 96% నీళ్లు ఉంటాయి. అలాగే ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్ జింక్ పొటాషియం వంటివీ లభిస్తాయి.

అయితే సొరకాయ ను కేవలం కూరల్లో మాత్రమే కాకుండా స్వీట్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు సులువుగా బరువు తగ్గాలి అనుకుంటే క్రమం తప్పకుండా సొరకాయలు వండుకొని తినాలి అని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువును తగ్గించడంతోపాటు అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే రోజుల్లో చాలామంది అనేక రకాల చిరుతిండ్ల వల్ల కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అటువంటివారు సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసే అటువంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సొరకాయ అందానికి కూడా బాగా మేలు చేస్తుంది. ఈ సొరకాయలో మీరు శాతం అధికంగా ఉండటం వల్ల అవి చర్మానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధాన సమస్య ఒత్తిడి. అనేక రకాల కారణాల వల్ల ప్రతి ఒక్కరూ ఈ ఒత్తిడి సమస్యకు గురవుతున్నారు. అయితే ఈ ఒత్తిడి సమస్య నుంచి బయటపడటం కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యోగా చేయడం మరికొందరు వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయినా కూడా కొంతమందికి ఒత్తిడి తగ్గదు. అటువంటివారు సొరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల ఒత్తిడి సమస్య దూరం అవుతుంది అని నిపుణులు చెబుతున్నారు.