Site icon HashtagU Telugu

Bommidayalu Pulusu: గోదావరి స్టైల్ బొమ్మిడాయిల పులుసు.. సింపుల్ గా తయారు చేయండిలా?

Mixcollage 25 Jan 2024 04 14 Pm 6359

Mixcollage 25 Jan 2024 04 14 Pm 6359

మామూలుగా చాలామంది ఎప్పుడూ తినే వంటకాలు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. కొందరు వివిధ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఫుడ్ ని తినాలని అనుకుంటూ ఉంటారు. అంటే ఆంధ్ర చేపల పులుసు,తెలంగాణ మటన్ కర్రీ ఇలాంటివి ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మీరు గోదావరి స్టైల్ బొమ్మిడాయిల పులుసు తిన్నారా. తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బొమ్మిడాయిల పులుసుకు కావాల్సిన పదార్ధాలు:

బొమ్మిడాయిలు -1/2 కేజీ
ఉల్లిపాయలు – 4
పచ్చి మిర్చి – 4
కారం – ౩ టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
చింత పండు గుజ్జు – కొద్దిగా
లవంగాలు – 5
యాలకులు – 2
దాల్చిన చెక్క – చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – 5
కరివేపాకు – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నూనె – సరిపడా

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం:

ముందుగా బొమ్మిడాయిలను శుభ్రం చేసుకోవాలి. గిన్నెలో కళ్ళు ఉప్పు వేసుకుని చేపలు వేసుకుని జిగురు పోయేవరకూ కడుక్కోవాలి. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సిలో వేసుకుని లవంగాలు ,యాలకులు , దాల్చిన చెక్క చిన్న ముక్క , వేల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దళసరి గిన్నె పెట్టుకొని ఆరు స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడి ఎక్కిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని వేయించిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. అనంతరం ఉల్లిపాయ మిశ్రమంలో కారం వేసుకుని కొంచెం సేపు వేయించుకుని ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బొమ్మిడాయిల చెపలను వేసుకుని కొన్ని సెకన్లు వేయించి తర్వాత చింతపండు గుజ్జు లో నీరు పోసుకుని దానిని పులుసు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా మరించిన తర్వాత ఉప్పు, పులుపు చూసుకోవాలి. దగ్గరకు మరిగించితే గోదావరి స్టైల్ లో అమ్మమ్మ కాలం నాటి రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ.

Exit mobile version