ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్ హెడ్స్ సమస్య కూడా ఒకటి. ఎక్కువగా ముక్కు, గడ్డం దగ్గర, ఛాతీ భాగాలపై బ్లాక్‌హెడ్స్ వస్తూ ఉంటాయి. కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల బ్లాక్‌హెడ్స్ ఏర్పడుతుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్,అలాగే వైట్ హెడ్స్ ని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడంతో పాటు బ్యూటీ పార్లర్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. కాగా బ్లాక్‌హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడానికి కొన్ని సహాజమైన మార్గాలు సహాయపడతాయి. మరి ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పచ్చి పాలు, ఒక గిన్నెలో పాలు పోసుకుని దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఆ పాలను ఒక కాటన్ లో పోసి అట్లా పిండేసి కాటన్ ని మీ ఫేస్ మీద దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ తర్వాత మీరు రెండో స్టెప్ చేయవలసిన పని మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో వాడే పేస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ క్రీమ్ తీసుకొని దాన్ని ఫేస్ కి అప్లై చేసుకొని ఆ తర్వాత మీరు ఒక స్టీమర్ తీసుకోవాలి. ఆవిరి పెట్టుకోటానికి ఎవరికైతే బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే ఆవిరి అనేది బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఆపై ఏదైనా మన బ్లాక్ హెడ్ రిమూవల్ చేసుకునే పిన్ తో దానికి సంబంధించిన పిన్ని తీసుకొని దాంతో మీరు బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు బ్లాక్ హెడ్స్ లేవు ఓన్లీ వైట్ హెడ్స్ మాత్రమే ఉన్నాయి అనుకుంటే దాని కోసం మీకు కావాల్సింది ఒక స్పూన్ ముల్తానీ పెట్టి దాంట్లో మీరు వేసుకోవాల్సింది పసుపు. ఇక మూడోది మీరు పాలు ఉంటే పాలు లేదంటే రోస్ వాటర్ ఈ మూడింటిని బాగా కలిపి మీ ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు కోల్డ్ వాటర్ తో ఫేస్ అనేది మీరు క్లీన్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మీరు లాస్ట్ గా చేయాల్సింది ఒక మోయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే ఉందో దాన్ని ఫేస్ కి అప్లై చేయడం అంతేనండి. కేవలం మీరు కచ్చితంగా పాటిస్తే మాత్రం అసలు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది.