Black Rice Idly: ఎంతో టేస్టీగా ఉండే బ్లాక్ రైస్ ఇడ్లీ.. ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగలదు?

మాములుగా మనం ఎక్కువగా ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలను ఎక్కువగా తింటూ ఉంటాము. ఆ ఇడ్లీలు వైట్ కలర్ లో ఉంటాయి. కేవలం ఇడ్పిండితో చేసే ఇడ్లీలు మాత్ర

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 10:00 PM IST

మాములుగా మనం ఎక్కువగా ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలను ఎక్కువగా తింటూ ఉంటాము. ఆ ఇడ్లీలు వైట్ కలర్ లో ఉంటాయి. కేవలం ఇడ్పిండితో చేసే ఇడ్లీలు మాత్రమే కాకుండా కొందరు రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ అంటూ రకరకాల ఇడ్లీ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా బ్లాక్ రైస్ ఇడ్లీ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏమేమి కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

నల్ల బియ్యం – పావు కప్పు
మినపపప్పు – 1/2 కప్పు
మెంతులు – చెంచా
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – కావలిసినంత

తయారీ విధానం:

అయితే ఇందుకోసం ముందుగా నల్లబియ్యం, మెంతులు, మినపపప్పు విడిగా కడిగి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని రుబ్బుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు వేసి 8 గంటల పాటు పులియనివ్వాలి. ఇడ్లీ ప్లేట్లపై నూనె రాసి ఇడ్లీ పిండిని పోయాలి. పది నిమిషాలు ఆవిరి మీద ఉంచాలి. కొబ్బరి చట్నీ, సాంబార్ తో కానీ వేడి వేడిగా వడ్డించుకుని తింటే టేస్ట్ అదిరిపోవడం ఖాయం.