Black Rice Idli: బ్లాక్ రైస్ ఇడ్లీ.. ఇలా చేస్తే చాలు ఒక్కటి కూడా మిగలదు?

మామూలుగా మనం ఇడ్లీ పిండితో తయారుచేసిన ఇడ్లీలను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే కొందరు రాగి ఇడ్లీ కొందరు జొన్న ఇడ్లీ అంటూ డిఫరెంట్ ఇడ్లీలను కూడా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 29 Jan 2024 06 11 Pm 867

Mixcollage 29 Jan 2024 06 11 Pm 867

మామూలుగా మనం ఇడ్లీ పిండితో తయారుచేసిన ఇడ్లీలను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే కొందరు రాగి ఇడ్లీ కొందరు జొన్న ఇడ్లీ అంటూ డిఫరెంట్ ఇడ్లీలను కూడా తింటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు బ్లాక్ రైస్ ఇడ్లీ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ బ్లాక్ రైస్ ఇడ్లీ ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ బ్లాక్ రైస్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి? దానికి ఏ ఏ పదార్థాలు కావాలి అన్న విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్లాక్ రైస్ ఇడ్లీకీ కావాల్సిన పదార్థాలు:

నల్ల బియ్యం – పావు కప్పు
మినపపప్పు – 1/2 కప్పు
మెంతులు – చెంచా
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – కావలసినంత

బ్లాక్ రైస్ ఇడ్లీ తయారీ విధానం:

ముందుగా నల్లబియ్యం, మెంతులు, మినపపప్పు విడిగా కడిగి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని రుబ్బుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు వేసి 8గంటలపాటు పులియనివ్వాలి. ఇడ్లీ ప్లేట్లపై నూనె రాసి ఇడ్లీ పిండిని పోయాలి. పది నిమిషాలు విరి మీద ఉంచాలి. కొబ్బరి చట్నీ, సాంబార్ తో కానీ వేడి వేడిగా వడ్డించుకుని తింటే టేస్ట్ అదిరిపోవడం కాయం.

  Last Updated: 29 Jan 2024, 06:12 PM IST