‎కాకరకాయ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

కాకరకాయ టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, ఈ టీ తరచుగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Bitter Gourd Tea

Bitter Gourd Tea

  • కాకరకాయ టీ వల్ల కలిగే లాభాలు
    ‎కాకరకాయ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
    ‎ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ టీ

    ‎‎‎Bitter Gourd Tea: కాకరకాయ పేరు వింటే చాలు చాలామంది వామ్మో అని అంటారు. కాకరకాయ కూరని తినడానికి అస్సలు ఇష్టపడరు. అందుకు గల కారణం చేదుగా ఉండటమే. చేదుగా ఉన్న కూడా కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. మరి కాకరకాయ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే కాకరకాయ కూరగా తినడం ఇష్టం లేకపోతే, కనీసం టీ రూపంలోనైనా దీనిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    ‎ఆరోగ్య సృహ ఉన్న చాలామంది కాకరకాయతో ఇతర పండ్లు, కూరగాయలు కలిపి స్మూతీలు లేదా టీ చేసుకొని తాగుతున్నారు. అలా కాకరకాయ టీ ని కూడా తీసుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇకపోతే కాకరకాయ టీ తయారీ విధానానికి వస్తే.. ముందుగా కాకరకాయను శుభ్రంగా కడిగి, గుండ్రటి ముక్కలుగా కోసుకొని, ఒక గిన్నెలో నీటిని తీసుకుని, అందులో ఈ ముక్కలను వేసి మీడియం మంటపై సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలట. నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి గిన్నెపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి.

    ‎దీనివల్ల కాకరకాయలోని సారం నీటిలోకి దిగుతుందట. తర్వాత ఆ నీటిని ఒక కప్పులోకి వడకట్టుకొని రుచి కోసం లేదా చేదును తగ్గించడానికి ఇందులో తగినంత తేనె లేదా బెల్లం కలుపుకోవచ్చట. దీనిని వేడి టీ లాగా సిప్ చేస్తూ తాగాలని చెబుతున్నారు. ఈ కాకరకాయ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఒక దివ్యౌషధం అని చెబుతున్నారు. చలికాలంలో గొంతు నొప్పి లేదా గరగర ఉంటే, వేడివేడి కాకరకాయ టీ తాగడం వల్ల గొంతుకు మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడంలో కాకరకాయ టీ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇందులోని పోషకాలు కంటి చూపును మెరుగుపరచడంతో పాటుగా సీజనల్ వ్యాధుల నుండి పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెబుతున్నారు.
  Last Updated: 18 Dec 2025, 10:09 AM IST