Site icon HashtagU Telugu

Bisi Bele Bath: వేరైటీగా ఉండే బిసి బెలె బాత్.. ఇంట్లోనే చేసుకోండిలా?

Mixcollage 15 Dec 2023 07 33 Pm 284

Mixcollage 15 Dec 2023 07 33 Pm 284

మామూలుగా చాలామందికి ఎప్పుడూ ఒకే రకమైన వంటలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు, ఇంట్లో భర్తలు మహిళలను వెరైటీగా ఏదైనా ట్రై చేయమని అడుగుతూ ఉంటారు. మహిళలకు కొత్త రెసిపీలు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అయితే మహిళల కోసం ఒక సరికొత్త వెరైటీ రెసిపీని తీసుకు వచ్చాము. బిసి బెలె బాత్ అనే రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ట్రై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బిసి బెలె బాత్ కి కావలసిన పదార్థాలు

అన్నం – 2 కప్పులు
ధనియాలు – 1 స్పూన్
మిరియాలు – 4
కందిపప్పు – ఒక కప్పు
సెనగపప్పు – 2 స్పూన్స్
ఆవాలు – 1 స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
జీడిపప్పు – కొద్దిగా
కరివేపాకు – సరిపడా
క్యారెట్ – ఒకటి
ఇంగువ – చిటికెడు
ఎండుమిర్చి – రెండు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
మెంతులు – 1/2 స్పూన్
కొబ్బరి తురుము – ఒక స్పూన్
చింతపండు – కొద్దిగా
బెల్లం – చిన్న ముక్క
అనపకాయముక్కలు – కొన్ని
ఉల్లిపాయ – ఒకటి
ములక్కాడ – ఒకటి

బిసి బెలె బాత్ తయారీ విధానం :

ముందుగా కందిపప్పు,కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు కుక్కర్లో ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సెనగపప్పు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి ధనియాలు వేయించుకొని కొబ్బరి కలిపి చల్లారక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తరువాత చింతపండు రసంలో గ్రైండ్ చేసిన ముద్దా కలిపి ,ఉడికించిన పప్పు, కూర ముక్కలు, ఉప్పు, బెల్లం కలిపి సాంబార్ వేడి చేయాలి. సాంబార్ లో ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగేకా జీడిపప్పు,ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిటికెడు ఇంగువ వేసి వేగాక సాంబార్ అన్నం వేసి కొంచెం గట్టిగా అయ్యే వరకు కలపాలి. అంతే బిసి బెలె బాత్ రెడీ..