Importance Of Moles: శరీరంపై పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?

పుట్టుమచ్చ అనేది చెరగని మచ్చ. శరీర చర్మంపై సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చల వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయని జ్యోతిష్యపరమైన శాస్త్రాలు చెబుతుంటాయి.

  • Written By:
  • Publish Date - August 24, 2022 / 09:30 AM IST

పుట్టుమచ్చ అనేది చెరగని మచ్చ. శరీర చర్మంపై సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చల వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయని జ్యోతిష్యపరమైన శాస్త్రాలు చెబుతుంటాయి. శరీరంపై ఒక్కోచోట ఉన్న మచ్చలకు కొన్ని ప్రభావాలు ఉంటాయని తెలుస్తుంది. ఇంతకు ఎక్కడ ఉంటే ఏ ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.

నొసలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఎప్పుడు సంపదతో ఆనందంగా ఉంటారట. అదే ఎడమవైపు ఉంటే దుఃఖాన్ని పొందటం, నష్టపోవడం జరుగుతుందట. ఇక నుదురు మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే మంచి సంపద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట. ఇక గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు జీవిత భాగస్వామితో ఘర్షణలు ఉంటాయని తెలుస్తుంది.

కుడి కన్ను పైన పుట్టుమచ్చ ఉంటే శుభవార్తలు వింటారని.. అంతేకాకుండా జీవిత భాగస్వామి నుండి మంచి ప్రేమను అందుకుంటారని తెలుస్తుంది. ఎడమ కన్నుపై పుట్టుమచ్చ ఉంటే బయట విషయాలపై పోరాటం ఎక్కువగా చేస్తారట. ఒక కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ సంపద కలిగి ఉంటారని.. అదే ఎడమ చెంప మీద ఉంటే సంపద కోల్పోతారని తెలుస్తుంది.

ఇక పెదాలపై, నాభిపై పుట్టుమచ్చ ఉంటే భారీ సెక్స్ డ్రైవ్ కలిగి ఉంటారట. మెడ మీద పుట్టుమచ్చ ఉంటే లగ్జరీ లైఫ్ ని గడుపుతారట. కుడి చెవి మీద పుట్టుమచ్చ ఉంటే తక్కువ జీవిత కాలాన్ని సూచిస్తుందట. ఇక ఎడమచెవి మీద ఉంటే ప్రమాదాలను నివారించగలుగుతారని తెలుస్తుంది. ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ప్రయాణాలు చేస్తారని తెలుస్తుంది.

అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని.. అదే ఎడమ చేతి మీద ఉంటే సంపద కోల్పోతారని తెలుస్తుంది. కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉంటే ధైర్యవంతులుగా ఉంటారని ఎడమ చేతి మీద ఉంటే బాయ్ బేబీని కలిగి ఉంటారని తెలుస్తుంది. కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ ప్రయాణాలు చేస్తారని తెలుస్తుంది. కనుబొమ్మ మధ్య ఉంటే విదేశాలలో ప్రయాణం చేస్తారట.

మీద పుట్టుమచ్చ ఉంటే భౌతిక ఆనందం కలుగుతుందట. వీపు మీద పుట్టుమచ్చ ఉంటే చెడు నోరు కలిగి ఉంటారట. ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే పిరికివాడని, సంతృప్తి కలిగి ఉంటారని తెలుస్తుంది. అదే కుడి భుజం మీద ఉంటే ధైర్యం, సామర్థ్యం కలిగి ఉంటారని తెలుస్తుంది.