Gold Rate Update:బంగారానికి రెక్కలు.. 51వేలు క్రాస్!!

గత వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రెక్కలు తొడిగాయి. పసిడి రేట్లు ఇక ఆగము అంటూ పైపైకి ఎగబాకుతున్నాయి. జులై 30వ తేదీ నాటికి మన దేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 51, 490కు చేరింది.

  • Written By:
  • Publish Date - July 31, 2022 / 05:00 PM IST

గత వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రెక్కలు తొడిగాయి. పసిడి రేట్లు ఇక ఆగము అంటూ పైపైకి ఎగబాకుతున్నాయి. జులై 30వ తేదీ నాటికి మన దేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 51, 490కు చేరింది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 47,200 కు తాకింది. జూలై 29న ఒక్కరోజే భారీ స్థాయిలో రూ.700 మేర పెరిగిన పసిడి ధర.. జులై 30న రూ.100 మేర పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.800 మేర ధర పెరిగినట్లయింది.

కారణాలు ?

అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులపై దృష్టి పెట్టారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌ రేట్స్‌ భారీగా పెరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా రానున్న రోజులు శుభ ముహుర్తాలు ఉన్న కారణంగా కూడా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
ఇది కూడా గోల్డ్‌ రేట్స్‌ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం,
సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ పాలసీలు, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్‌ లో చోటుచేసుకునే పరిణామాలు వంటి కారణాల వల్ల కూడా బంగారం రేటు పెరుగుతుంటుంది.

బంగారం స్వచ్ఛత .. బంగారం రేటు తెలుసుకోండి?

బంగారం స్వచ్ఛతను ‘బిఐఎస్ కేర్ యాప్’ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ యాప్ సహాయంతో బంగారం స్వచ్ఛతను తెలుసుకోవడమే కాకుండా దానిపై ఫిర్యాదులను కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఇక బంగారం తాజా రేటును ఎప్పటికప్పుడు తెలుసుకునే మార్గం కూడా ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్ కు చెందిన 8955664433 ఫోన్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ ఫోన్ కు 22 క్యారెట్, 18 క్యారెట్ గోల్డ్ లేటెస్ట్ రేట్స్ మెసేజ్ ద్వారా అందుతాయి.