Site icon HashtagU Telugu

Bhaang Pakodi: ఎప్పుడైనా బాంగ్ పకోడీ తిన్నారా.. తినకపోతే ట్రై చేయండిలా?

Mixcollage 08 Feb 2024 08 28 Pm 741

Mixcollage 08 Feb 2024 08 28 Pm 741

మామూలుగా మన పకోడీలో ఎన్నో రకాల పకోడీలను తింటూ ఉంటాం. ఈవినింగ్ స్నాక్స్ గా ఈ పకోడీలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా ఆనియన్ పకోడా, బ్రెడ్ పకోడా అంటూ ఇలా రకరకాల పకోడీలను తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా బాంగ్ పకోడీ తిన్నారా. వినడానికి కొత్తగా ఉన్న ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భాంగ్‌ పకోడి కావలసిన పదార్థాలు :

సెనగపిండి – రెండు కప్పులు
పసుపు – చిటికెడు
కారం – ఒక టేబుల్‌ స్పూన్
మామిడికాయ పొడి – అర టీస్పూన్
భాంగ్‌ పౌడర్‌ – కొద్దిగా
ఉప్పు – తగినంత
ఉల్లిపాయ – ఒకటి
బంగాళదుంప – ఒకటి

భాంగ్‌ పకోడి తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని అందులో కారం, మామిడికాయ పొడి, భాంగ్‌ పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి, నీళ్లు పోసి కలపాలి. తరిగిన ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేయాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని చేత్తో తీసుకుని కొద్దికొద్దిగా వేసి వేగించాలి. పకోడి గోధుమరంగులోకి మారే వరకు వేగించుకోవాలి. ఈ భాంగ్‌ పకోడి పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.