Site icon HashtagU Telugu

International Men’s Day : మగాళ్లు ఈ ప్రమాదకరమైన 5 వ్యాధులతో జర పైలం…!!

Young Man In Consultation With Doctor

Young Man In Consultation With Doctor

మగవారు చూడటానికి ఎంతో గంభీరంగా, దృఢంగా కనిపించినా…వారికి అనారోగ్య సమస్యలతోపాటు ఒత్తిడి ఉంటుంది. ఆధునిక కాలంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి వీటితో జబ్బు బారిన పడుతున్నారు. అందుకే వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. మగవారు ముఖ్యంగా ఈ 5 వ్యాధులకు ఎక్కువగా గురువుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యాధులేంటో ఓసారి చూద్దాం.

అమెరికన్ ఆరోగ్య నిపుణులు కెవిన్ పోల్స్లీ తన అధ్యయనంలో పురుషులు ఐదు రకాల ప్రధాన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు వాటిని నివారించేందుకు మార్గాలను కూడా సూచించారు.

స్లీప్ అప్నియా
ఓ అంచనా ప్రకారం భారత్ లో ఒక కోటి 80లక్షల మంది పురుషులు స్లీప్ అప్నియా సమస్యతో బాధపడుతున్నారని తేలింది. గురక, రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, ఉదయం తీవ్రమైన తలనొప్పి, నిద్రలేవగానే నోరుఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. దీంతోపాటు అలసట, బద్ధకం కూడా ఉంటుంది.

నివారణ
ఈ లక్షణాలు కనిపించినప్పుడు జనరల్ ఫిజిషియన్ లేదా ఈఎన్టీ స్పెషలిస్ట్ తో చెకప్ చేయించుకోండి. వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి.

అధిక కొలెస్ట్రాల్
ఈ వ్యాధి జన్యపరంగా కూడా వస్తుంది. నేటి కాలంలో జీవన శైలి కారణంగా కూడా ఈ సమస్య ఏర్పడతుంది

నివారణ
సరైన ఆహారం, వ్యాయామం తప్పకుండా చేయాలి. మీ కుటుంబంలో అధిక కొలెస్ట్రాల్ బాధపడినవారు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

పెద్దప్రేగు క్యాన్సర్
ఈ మధ్య పురుషులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే దీనికి చికిత్స ద్వారా నయం చేయవచ్చు.

నివారణ
50ఏళ్ల తర్వాత ప్రతి పది సంవత్సరాలకోసారి కొలనోస్కోపి చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే ముందుగానే ఈ టెస్ట్ చేయించుకోవాలి.

గుండె వ్యాధులు
మహిళల కంటే పురుషులకు ఈ జబ్బులు ఎక్కువగా వస్తాయి. కుటుంబంలో ఎవరికైన గుండె జబ్బులు ఉంటే మరింత ప్రమాదకరం.

నివారణ
క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. తరచుగా చెకప్ చేయిస్తుండాలి.

అధికరక్తపోటు
ఊబకాయం, కుటుంబం చరిత్ర ఈ రెండు అధికరక్తపోటుకు ప్రధానకారణాలు. ఒత్తిడి లేదా ఆందోళనతో కూడా అధికరక్తపోటుకు కారణం అవుతుంది.

నివారణ
బరువు తగ్గడం,ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచి జీవన శైలిని ఏర్పరుచుకోవడం సమయానికి నిద్ర, ఆందోళన లేని జీవితాన్ని గడపడం ముఖ్యం.