Site icon HashtagU Telugu

Gastric Problem: గ్యాస్టిక్ సమస్యతో బాధపడుతున్నారా..అయితే తమలపాకుతో చెక్ పెట్టండిలా?

Betel Leaves

Betel Leaves

Gastric Problem: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మనుషుల ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనది గ్యాస్టిక్ సమస్య. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో ఉన్న ఆమ్లం అన్నవాహిక లోకి తిరిగి వచ్చినప్పుడు అజీర్ణం సంభవిస్తుంది. దీంతో కడుపులో మంటగా అనిపించడం నొప్పిగా అనిపించడం అది కాస్త పెద్దదిగా అయ్యి వికారం లాంటి సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. దీంతో ఈ గ్యాస్ సమస్యకు ఎప్పుడు చాలామంది మందులపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.

అయితే ఈ మందులను వాడడం వల్ల ఆ కొద్దిసేపు ఉపశమనం లభిస్తుంది కానీ ఈ మందులు దీర్ఘకాలికంగా ఉపయోగపడవు. మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కడుపున ప్రశాంతంగా ఉంచడంలో గ్యాస్టిక్ సమస్యను తగ్గించడంలో తమలపాకు చక్కగా ఉపయోగపడుతుంది. తమలపాకుతో గ్యాస్ కి సమస్యలను ఏ విధంగా చెక్ పెట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భారతదేశంలో భోజనం అనంతరం తమలపాకును నమలడం లేదా పాన్ వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొందరు గుల్కంద్, తరిగిన వాల్‌నట్‌లు, కొబ్బరి పొడి, తేనె, లవంగాలు ,యాలకుల గింజలు వేస్తారు. ఈ పాన్ తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్టిక్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు లో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ , యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. కాగా ఇవి మన జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. అంతే కాకుండా లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. అలాగే తమలపాకుల నుండి నూనెను తయారు చేసి, మీ కడుపుపై ​​మసాజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. అలాగే జ్యూస్‌లు ,జీర్ణ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తమలపాకులో విటమిన్ సి థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ ,కెరోటిన్ వంటి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగగా లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలోని pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగండి లేదా నానబెట్టిన తమలపాకులను అది గ్యాస్టిక్ సమస్యను దూరం చేస్తుంది.