Site icon HashtagU Telugu

Betel leaf: జుట్టుకి సంబంధించిన సమస్యలా.. అయితే తమలపాకుతో ఇలా చేయాల్సిందే?

Betel Leaf Feature Compressed

Betel Leaf Feature Compressed

హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో ముఖ్యంగా తమలపాకును తప్పకుండా వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లో జరిగే పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి తమలపాకులను వాడుతూ ఉంటారు. తమలపాకును ఆధ్యాత్మికంగానే కాదు అనారోగ్యాల చికిత్సలోనూ వాడుతుంటారు. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగిస్తారు. తమలపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ A, విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్‌ బి1 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులోని పోషకాలు ఆరోగ్యానికే కాదు. జుట్టు సంరక్షణకు సహాయపడతాయి. తమలపాకులోని యాంటీ మైక్రోబయాల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

తమలపాకులోని పోషకాలు జుట్టు చిట్లడం, పల్చబడటం వంటి సమస్యలను నిరోధిస్తాయి. తమలపాకులోని అధికంగా ఉండే తేమ, జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది. తమలపాకులోని విటమిన్‌ సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్‌ గుణాలు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది చుండ్రు సమస్యకు చెక్‌ పెడుతుంది. తమలపాకు జుట్టు కండీషనర్‌లా పనిచేస్తుంది. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.​ మరి ఇందుకోసం ఏఏ పదార్థాలు కావాలి అన్న విషయానికి వస్తే… తమలపాకులు – 5, కొబ్బరి నూనె – 1-2 టేబుల్ స్పూన్లు, ఆముదం – 1 టేబుల్‌ స్పూన్‌, కొంచెం నీళ్లు తీసుకోవాలి.

తర్వాత తమలపాకులను పేస్ట్‌ చేసుకుని, దానిలో కొబ్బరి నూనె, ఆముదం, కొన్ని చుక్కల నూనె వేసుకుని పేస్ట్‌లా చేసుకోండి. ఈ మాస్క్‌ను మీ తలకు, జుట్టుకు అప్లై చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇది 30 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు త్వరగా పెరుగుతుంది. మరో రెమిడి విషయానికి వస్తే.. పది తమలపాకులకు తగినంత నీటిని కలిపి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో మూడు చెంచాల నెయ్యి, చెంచాన్నర తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట ఆరనివ్వాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చివర్లు చిట్లడం తగ్గడంతోపాటు రాలే సమస్యను దూరం చేస్తుంది. మీ జుట్టును మృదువుగా, ఒత్తుగా చేస్తుంది.​ అలాగే అర గుప్పెడు చొప్పున మందార పూలు, కరివేపాకు, తులసి ఆకులు, అయిదారు తమలపాకులను మిక్సీలో వేసి తగినంత నీటిని కలుపుతూ.. మెత్తగా చేయాలి. ఇందులో రెండు చెంచాల కొబ్బరినూనె కలిపి తలకు రాసి గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఈ ప్యాక్‌ వేస్తి తలస్నానం చేస్తే పట్టులాంటి, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది.​