Betel leaf for hair growth: ఒత్తైనా జుట్టు కావాలా.. అయితే తమలపాకుతో ఇలా చేసి చూడండి?

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తమలపాకు కేవలం ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగానే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగప

Published By: HashtagU Telugu Desk
Betel Leaf Benefits

Betel Leaf For Hair Growth

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే తమలపాకు కేవలం ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగానే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనలో చాలామందికి ఈ విషయం తెలియదు.. తమలపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఏ , విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్‌ బి1 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తమలపాకులోని పోషకాలు ఆరోగ్యానికే కాదు. జుట్టు సంరక్షణకు సహాయపడతయి. తమలపాకులోని యాంటీ మైక్రోబయాల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

తమలపాకులోని పోషకాలు జుట్టు చిట్లడం, పల్చబడటం వంటి సమస్యలను నిరోధిస్తాయి. తమలపాకులోని అధికంగా ఉండే తేమ, జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది. తమలపాకులోని విటమిన్‌ సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్‌ గుణాలు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది చుండ్రు సమస్యను చెక్‌ పెడుతుంది. తమలపాకు జుట్టు కండీషనర్‌లా పనిచేస్తుంది. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.​ అయితే ఇందుకోసం ఐదు తమలపాకులు కొబ్బరి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు, ఆముదం ఒక టేబుల్ స్పూన్ కొంచెం నీళ్లు తీసుకోవాలి .

తమలపాకులను పేస్ట్‌ చేసుకుని, దానిలో కొబ్బరి నూనె, ఆముదం, కొన్ని చుక్కల నూనె వేసుకుని పేస్ట్‌లా చేసుకోండి. ఈ మాస్క్‌ను మీ తలకు, జుట్టుకు అప్లై చేయండి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్‌ చేయండి. ఇది 30 నిమిషాల పాటు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు త్వరగా పెరుగుతుంది. పది తమలపాకులకు తగినంత నీటిని కలిపి మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో మూడు చెంచాల నెయ్యి, చెంచాన్నర తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చివర్లు చిట్లడం తగ్గడంతోపాటు రాలే సమస్యను దూరం చేస్తుంది. మీ జుట్టును మృదువుగా, ఒత్తుగా చేస్తుంది.​

  Last Updated: 05 Sep 2023, 09:16 PM IST