Site icon HashtagU Telugu

Betel leaf For Haircare: జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే తమలపాకు పేస్టులో ఇది కలిపి రాయాల్సిందే?

Mixcollage 01 Feb 2024 01 25 Pm 4945

Mixcollage 01 Feb 2024 01 25 Pm 4945

హిందువుల్లో తమలపాకును ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వినియోగిస్తూ ఉంటారు. ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా తమలపాకుకి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కాగా తమలపాకులో యాంటీ-టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్‌, యాంటీ డయాబెటిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ-అల్సర్‌‌ లక్షణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలోనూ దీన్ని వాడుతుంటారు. తమలపాకు మన కేశాల సంరక్షణలోనూ సహాయపడుతుంది. తమలపాకు లోని విటమిన్‌ ఏ, బీ1, బీ2, సీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కురులను దృఢంగా చేస్తూనే చుండ్రుని నియంత్రిస్తాయి.

అయితే మీరు జుట్టు ఒత్తుగా పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా. అయితే తమలపాకుతో ఈ విధంగా చేస్తే చాలు జుట్టు ఒత్తుగా గడ్డి లాగా గుబురుగా పెరగడం కాయం. శీతాకాలం జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి పది తమలపాకులను మిక్సీలో వేసుకుని కొన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత అందులో రెండు స్పూన్ల తేనె వేసి మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‌ మీ మాడును హెల్తీగా ఉంచుతుంది. జుట్టు చివర్లు చిట్లడం తగ్గడంతో పాటు రాలే సమస్యను దూరం చేస్తుంది.

జుట్టును మృదువుగా మార్చి ఒత్తిగా చేస్తుంది. ఐదు తమలపాకులను పేస్టు చేసుకొని దానికి రెండు స్పూన్ల కొబ్బరి నూనె, స్పూను ఆముదం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కుదుళ్ల వరకు పట్టించి, అరగంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయిదారు తమలపాకులు, అర గుప్పెడు చొప్పున మందార పూలు, కరివేపాకు, తులసి ఆకులు మిక్సీలో వేసి తగినంత నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్‌లా చేయాలి. ఇందులో రెండు చెంచాల కొబ్బరినూనె కలిపి తలకు రాసి గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే మృదువైన, ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఆముదంతో అయిదు తమల పాకులను తీసుకొని తగినంత నీళ్లు వేసి పేస్ట్‌లా చేయాలి. తర్వాత దీనిలో రెండు చెంచాల కొబ్బరినూనె, చెంచా ఆముదం వేసి బాగా మిక్స్‌ చేసి తలకు అప్లై చేయండి. దీన్ని గంటపాటు ఆరనిచ్చి ఆ తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేస్తే చాలా మంచిది.