Coconut Oil : వామ్మో.. కొబ్బరి నూనె అందానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందా?

కొబ్బరి నూనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి ఎన్నో రకాల ప్ర

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 09:15 PM IST

కొబ్బరి నూనె వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి కొబ్బరి నూనె వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే కొబ్బరి నూనెను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోరువెచ్చని కొబ్బరినూనెని షాంపూ చేసే ముందు రాసి మసాజ్ చేయడం మంచిది. ఇది మీ జుట్టు పొడి బారడం, చివర్లు చిట్లడం, ఎండవల్ల కలిగే ఇబ్బందులని దూరం చేస్తుంది. అలాగే కొబ్బరినూనె స్కిన్ హైడ్రేట్, మాయిశ్చర్‌గా ఉంచేందుకు ఉపయోగించవచ్చు.

దీని వాడడం వల్ల చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. అయితే కొంతమంది దీనిని ముఖానికి వాడతారు. అలాగే కొబ్బరినూనెని మేకప్ తీసేయడానికి వాడవచ్చు. ఇందులోని ఇంప్యూరిటీస్ మేకప్ పార్టికల్స్‌ని చర్మం నుంచి తీసేస్తాయి. అదే విధంగా చర్మంపై ఓ లేయర్‌ని ఏర్పరుస్తాయి. అదేవిధంగా చాలామందికి జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అలాంటి సమస్యకి కొబ్బరి నూనె చక్కని పరిష్కారం చూపుతుంది. 3 నుంచి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో 15 నుంచి 20 చుక్కల రోజ్‌మేరీ ఆయిల్ వేయాలి. దీనిని బాగా మిక్స్ చేసి స్కాల్ప్, హెయిర్ రూట్స్‌కి బాగా అప్లై చేసి మసాజ్ చేసి, షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూ చేయాలి.

ఇది జుట్టుని పట్టుకుచ్చులా మారుస్తుంది. కొన్ని సార్లు జుట్టు ఫ్రీజీగా మారుతుంది. చూడ్డానికి అస్సలు బాగోదు. అలాంటి సమయంలో కొద్దిగా కొబ్బరి నూనెని అరచేతుల్లో వేసి బాగా రబ్ చేసి ఫ్రిజీగా ఉన్న జుట్టుకి మసాజ్ చేస్తే బలంగా మారతాయి. కొబ్బరి నూనెని బాడీ స్క్రబ్‌లా కూడా వాడవచ్చు. ఇందుకోసం మీ స్క్రబ్‌లో కొద్దిగా కొబ్బరి నూనెని చేర్చి బాగా కలిపి స్క్రబ్ చేయాలి. దీంతో స్క్రబ్ వల్ల వచ్చే ఇరిటేషన్ వంటి సమస్యలు ఉండవు. కొబ్బరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టులోని చుండ్రుని దూరం చేసేందుకు సహాయపడతాయి. చాలా మంది పురుషులు షేవింగ్ చేస్తుంటారు. అప్పుడు ముందు తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అయితే ముందు రాసేటప్పుడు మరీ ఎక్కువగా రాయకూడదు.