Site icon HashtagU Telugu

Garlic: ఆ ఒక్క పని చేస్తే చాలు నెలలపాటు పాడవని వెల్లుల్లి.. అదెలా సాధ్యం అంటే?

Remedies For Cholesterol

Remedies For Cholesterol

మన వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో వెల్లుల్లి కూడా ఒకటి. ఈ వెల్లుల్లి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు ఈ వెల్లుల్లి రేట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. వెల్లుల్లిని వాడకుండా వంటలు చేసుకుంటే మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును మార్కెట్లలో కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్. అది తాజాగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల కర్రీలో మంచి ఫ్లేవర్ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join
ఇందుకోసం మనం వెల్లుల్లిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. మరీ వెల్లుల్లి పాడవ్వకుండా ఎక్కువ రోజులు ఉండాలం టే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెల్లుల్లి గుండెను కాపాడుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది, సంతానోత్పత్తిని పెంచుతుంది. ఇలా చాలా లాభాలు ఉన్నాయి. అందువల్ల వీటిని ఎక్కువగా వాడటం మంచిదే. పైగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు తక్కువ ధరకు లభిస్తుంది. వెల్లుల్లిలో దాదాపు 11 రకాలు ఉన్నాయి.

Also Read: Vastu Tips: టెర్రస్ పై అరటి చెట్టు పెంచుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

వెల్లుల్లిని కొనేటప్పుడు గుండ్రంగా ఉండేవి, పెద్ద రెబ్బలు ఉండేవి కొనుక్కోవాలి. రెబ్బలు గట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, మొలకెత్తుతున్నా అలాంటి వెల్లుల్లి కొనుగోలు చేయకూడదు. వెల్లుల్లిని రెబ్బలు విడగొట్టకుండా.. అలాగే స్టోర్ చెయ్యాలి. అప్పుడే నిల్వ ఉంటాయి. రెబ్బలు విడదీస్తే.. 10 రోజులకు మించి ఉండవు. వెల్లుల్లిని గాలి తగిలే, సాధారణ పొడి వాతావరణంలో ఉంచవచ్చు. ఐతే వేడి లేకుండా ఉష్ణోగ్రత 15 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశంలో ఉంచుకోవాలి. ఫ్రిజ్‌లో తక్కువ చల్లదనం ఉండే ప్రదేశంలో వెల్లుల్లిని ఉంచవచ్చు. కానీ ఒకసారి వాటిని ఫ్రిజ్ నుంచి బయటకు తీస్తే నెక్ట్ కొన్ని రోజుల్లోనే అవి మొలకలు రావడం ప్రారంభిస్తాయి.

Also Read: Dry Coconut Benefits: ఎండు కొబ్బరి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

అందువల్ల ఫ్రిజ్‌లో ఉంచడం కరెక్టు కాదు. వెల్లుల్లి రెబ్బలను గాలి చేరని సీసాలో ఉంచి.. ఫ్రిజ్‌లో 2 వారాల వరకూ నిల్వ చేయడం మంచిది.
ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో వెల్లుల్లిని ఉంచవచ్చు గానీ అలా ఉంచితే వాటిలో రుచి, పరిమళాలు మిస్ అవుతాయి. అందువల్ల అక్కడ ఉంచవద్దు. అలాగే మొలకలు వచ్చిన వెల్లుల్లిని కూడా మనం కూరల్లో వాడుకోవచ్చు. కానీ ఆ మొలకలు చాలా చేదుగా ఉంటాయి. అవి కూర రుచిని దెబ్బతీస్తాయి. అందువల్ల అలాంటివి ఎవరూ వాడరు. వెల్లుల్లిని ఉంచినప్పుడు వాటిని దేనికదే విడివిడిగా ఉండేలా ఉంచుకోవాలి. అప్పుడు ఒకటి పాడైనా మిగతావి బాగానే ఉంటాయి. అలాగే ఆ వెల్లుల్లిని తరచూ గమనిస్తూ ఉండాలి.