మనం ఆరోగ్యంగా అలాగే అందంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి. మంచి మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ని తీసుకుంటే అందంగా ఉండడంతో పాటు యంగ్ గా కనిపిస్తారని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఈ సమ్మర్ లో కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శాంతింప చేస్తాయట.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయని, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని అవుతున్నారు. అలాగే కలబంద జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. కలబందను మామూలుగా ఆరోగ్యపరంగా కంటే అందానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కలబంద జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటుగా చర్మానికి కూడా తగిన తేమను అందిస్తుందని చెబుతున్నారు. కలబందలో ఉండే పోషకాలు చర్మాన్ని ట్యాన్ బారిన పడకుండా కాపాడుతాయట. కాంతివంతమైన చర్మం కోసం కలబంద జ్యూస్ తాగితే ఎంతో మంచిదని చెబుతున్నారు. అలాగే కీరదోస పుదీనా డ్రింక్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట.
శరీరాన్ని శాంత పరచడం కోసం ఈ డ్రింకు చాలా బాగా పనిచేస్తుందట. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం మాత్రమే కాకుండా చర్మానికి సహజ మెరుపును అందిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ టీ.. దీన్ని దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం వేడి కారణంగా కలిగే ఇబ్బందులు నుండి ఉపశమనం పొందవచ్చును చెబుతున్నారు. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఇందులోని పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయట. ఇందులో ఉండే బీటా కెరోటిన్, ఐరన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని, ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం గ్లో అవుతుందని ప్రకాశవంతంగా కనపడుతుందని చెబుతున్నారు.
నిమ్మరసం, ఆరోగ్యానికి చర్మానికి ఎంతో మేలు చేస్తుందట. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని ట్యాక్సీన్లు బయటకు పోతాయట. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని హైడ్రేటేషన్ ను పెంచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని చెబుతున్నారు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, ఇది హైడ్రేటేషన్ పెంచుతుందని, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందని చెబుతున్నారు. అలాగే దానిమ్మ రసం తాగడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయట. చర్మం ఉల్లాసంగా కనిపిస్తుందని చెబుతున్నారు. పుచ్చకాయ రసం వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనువైన డ్రింక్ అని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయట. ఈ రసం తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుందని చెబుతున్నారు.