Site icon HashtagU Telugu

Lemon Peel: నిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 09 Jan 2024 11 29 Am 7975

Mixcollage 09 Jan 2024 11 29 Am 7975

నిమ్మకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయను వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే లెమన్ జ్యూస్ కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. అయితే కేవలం నిమ్మకాయ మాత్రమే కాకుండా నిమ్మ తొక్క వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన సమస్యలను పోగొట్టడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

మరి నిమ్మ తొక్క వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిమ్మ చెక్క పొడి చర్మ సంరక్షణను కాపాడుతుంది. ఈ నిమ్మ చెక్క పొడి ఆల్ ఇన్ వన్ పౌడర్ గా పనిచేస్తూ ముఖంపై ఎటువంటి మొటిమలు రాకుండా టాన్ ని తొలగిస్తూ తెల్లగా తయారు చేస్తుంది. పూర్తిగా సేంద్రీయ నిమ్మపొడి సహజమైన చర్మం తెల్లబడటం కోసం పని చేస్తుంది. నిమ్మకాయ తొక్కలలో విటామిన్ సి ఎక్కువగా ఉండడం, ఎక్స్ ఫోలేయేటింగ్ లక్షణాలతో రావడం వల్ల మార్పులు, మచ్చలను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అత్యంత సహజమైన పద్ధతిలో చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మ సంరక్షణలో అసంఖ్యాక ప్రయోజనాలను ఇస్తుంది.

చర్మ ప్రక్షాళన, స్కిన్ పాలిషింగ్, స్కిన్ టోనింగ్, మాయిశ్చరైజింగ్ చర్మం ఆదర్శ పోషణ పోషనను అందించడం నుంచి చర్మ ఆరోగ్యాన్ని ప్రధాన మార్గంలో చేర్చడానికి సహాయపడుతుంది. సహజమైన యాంటీ ఏజింగ్ పౌడర్ గా కూడా ఇది పనిచేస్తుంది. విటామిన్ సి కారణంగా యవ్వనంతో చర్మం మెరవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రకాశవంతమైన రంగు కోసం నిమ్మ తొక్క పొడిని ఇలా తయారు చేసుకోవచ్చు. కాగా ఈ నిమ్మ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా ఒక గ్లాసు నీళ్ల గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ తొక్క, రెండు టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం వేసి పేస్టు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ ఇతర ప్రాంతాల్లో అప్లై చేసుకోవాలి. కనీసం 20 నుంచి 25 నిమిషాల పాటు ఆరేలా చేస్కోవాలి. అది ఎండిన తర్వాత ఉత్తమ ఫలితాల కోసం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మ తొక్కలు ప్రభావంతో ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ రోజంతా తాజా అనుభూతిని ఇస్తుంది.

Exit mobile version