హైదరాబాద్ (Hyderabad) నగరం షాపింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నగరంలోని గల్లీ గల్లీకి దుకాణాలు ఉండటంతో అవసరమైన అన్ని రకాల వస్తువులు తక్కువ ఖర్చులో కొనుగోలు చేయడం సాధ్యమవుతోంది. ముఖ్యంగా చార్మినార్ వద్ద లాడ్ బజార్, కోటి మార్కెట్, సుల్తాన్ బజార్ వంటి ప్రాంతాలు ట్రెడిషనల్ దుస్తులు, బ్యాంగిల్స్, చీరలు, కుర్తీలు వంటి వస్తువుల కొనుగోలుకు ప్రసిద్ధి చెందాయి. చార్మినార్ బజార్ వద్ద చెప్పులు, ట్రెడిషనల్ జ్యూవెలరీలను కూడా సరసమైన ధరల్లో కొనుగోలు చేయవచ్చు. షహ్రాన్ మార్కెట్ సింపుల్ స్టైల్ దుస్తుల కోసం ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది.
Glenn Maxwell: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. ఆసీస్‌కు భారీ షాక్!
హోల్‌సేల్ షాపింగ్ కోరుకునే వారు బేగంబజార్, జనరల్ బజార్, అబిడ్స్ స్ట్రీట్ వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు. బేగంబజార్ వంటసామాగ్రి, డ్రై ఫ్రూట్స్ కొనుగోలుకు ప్రఖ్యాతి పొందగా, జనరల్ బజార్ మగవారికి షర్టులు, ప్యాంట్లు, షూలు మొదలైన వస్తువులకు ప్రసిద్ధి చెందింది. చోర్ బజార్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులను అతి తక్కువ ధరల్లో పొందవచ్చు. అరబిక్ అత్తర్లు కొనాలంటే మీర్‌చౌక్ వద్ద ఉన్న పెర్ఫ్యూమ్ మార్కెట్ ఉత్తమమైన ఆప్షన్.
Thalliki Vandanam : రూ.15,000 నగదు ట్రాన్స్‌ఫర్‌కు ఏర్పాట్లు పూర్తి
ట్రెండీ లుక్స్ కోసం, యువతకు నచ్చే స్ట్రీట్ ఫ్యాషన్ షాపింగ్‌కు అమీర్‌పేట్ జంక్షన్, KPHB షాపింగ్ స్ట్రీట్ మంచి ఆప్షన్లు. డిజైనర్ డ్రెస్‌లు, బ్యాగులు, ఎలక్ట్రానిక్స్, నగలు వంటి వాటికి ఇక్కడ ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అబిడ్స్ స్ట్రీట్‌లో బ్రాండెడ్ వస్తువులపై డిస్కౌంట్లు లభ్యమవుతాయి. ఓవరాల్ గా హైదరాబాద్‌లో సరైన ప్రాంతాన్ని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ వస్తువులను షాపింగ్ చేయొచ్చు. అందుకే రిచ్ పర్సన్స్ కూడా ఈ ప్లేస్ ల్లో షాపింగ్ చేస్తుంటారు.