Site icon HashtagU Telugu

Beauty Tips: మీ చర్మం వజ్రంలా మెరవాలంటే.. ఈ ఒక్కటి పాటిస్తే చాలు!

Mixcollage 13 Feb 2024 01 47 Pm 7116

Mixcollage 13 Feb 2024 01 47 Pm 7116

మామూలుగా ప్రతి ఒక్కరూ మెరిసిపోయే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లు ఉపయోగించడంతోపాటు,హోమ్ రెమెడీలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా ఏది పడితే వాడటం వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటుంది. దాంతో ఏం చేయాలో తెలియక చాలామంది ఏవేవో ఉపయోగిస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇకమీదట అవసరం లేదు. ఎందుకంటె ఇంట్లో పైసా ఖర్చు పెట్టకుండా మన చేతులతో మనమే అద్భుతంగా హోమ్ రెమెడీస్ తయారు చేసుకుని మన స్కిన్ తోని మార్చుకునే సూపర్ ఛాన్స్ మనం వంటింట్లోనే ఉంది.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమిడిని తరచూ ఫాలో అయితే చాలు. ఇంతకీ ఆ రెమిడి ఏంటి అన్న విషయానికి వస్తే.. దీనికోసం మీరు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటే ఒక స్పూన్ షుగర్ కలుపుకోవాలి. ఒకవేళ మీరు బ్రౌన్ షుగర్ వాడాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకున్నా ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అయితే కచ్చితంగా ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ లేదా అని లేకపోతే ఆలివ్ ఆయిల్ గాని వేసుకొని అప్పుడు స్క్రబ్ చేసుకోవాలి.

కాఫీ పొడిలో ఇలా ఆయిల్ కలుపుకుని స్క్రబ్ చేస్తే మృత కణాలు చక్కగా తొలిగిపోయి చర్మ మృదువుగా తాజాగా ఉంటుంది. కాఫీపొడి స్కిన్ ని టైట్ గా చేస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చెప్పిన ఈ స్క్రబ్లను మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫేస్ గ్లోగా కాంతినేనితో అందంగా క్లీన్ గా మీ స్కిన్ మంచి కాంతివంతంగా మారుతుంది. ఈ సింపుల్ చిట్కాను తరచుగా ఫాలో అయితే చాలు వజ్రంలా మెరిసిపోయే చర్మం మీ సొంతం.