Lip Care: నల్లని పెదాలు పింక్ కలర్ లోకి మారాలంటే.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?

మామూలుగా చాలా మందికి పెదవులు నల్లగా ఉంటాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినప్పటికీ పెదవులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి మాత్రం పె

Published By: HashtagU Telugu Desk
Mixcollage 07 Feb 2024 01 41 Pm 7185

Mixcollage 07 Feb 2024 01 41 Pm 7185

మామూలుగా చాలా మందికి పెదవులు నల్లగా ఉంటాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినప్పటికీ పెదవులు నల్లగా కనిపిస్తూ ఉంటాయి. కొందరికి మాత్రం పెదవులు ఎరుపుగా పింక్ కలర్ లో ఉంటాయి. నల్ల పెదాలు ఉన్నవారు పెదాలను పింక్ కలర్ , రెడ్ కలర్లోకి మార్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు చక్కగా వంటింటి చిట్కాలు పాటిస్తే ఇంకొందరు బ్యూటీ ప్రాడక్టులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మరి నల్లని పదాలు పింక్ కలర్ లోకి మారాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనె, పసుపు, కొద్దిగా పంచదార పొడిలా చేసి వేయాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం కలపి పేస్టులా చేయాలి. దీనిని పెదాలకి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. తర్వాత టూత్‌బ్రష్‌తో పెదాలను సున్నితంగా మసాజ్ చేస్తే నలుపు తగ్గి పెదాలు మృదువుగా అందంగా మారతాయి. అలాగే నిమ్మరసం అనేది చర్మానికి మేలు చేస్తుంది. నల్లమచ్చల్ని తగ్గించి చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. ఇది పెదాలపై ఉన్న నలుపుని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు బ్లీచింగ్ ప్రభావాలు ఉంటాయి. దీంతో ఇది పెదాల నలుపుని దూరం చేస్తుంది. టాన్‌ని దూరం చేసేందుకు పసుపు బాగా పనిచేస్తుంది.

దీనిని బ్యూటీ ట్రీట్‌మెంట్‌లో వాడొచ్చు. దీనిని వాడడం వల్ల చర్మంపై ఉన్న నలుపు తగ్గి చర్మం చక్కగా మెరుస్తుంది. లిప్‌మాస్క్ తయారు చేయడానికి కొబ్బరినూనె, పసుపు, చక్కెర, నిమ్మరసం అవసరం. కొబ్బరినూనె అనేది బ్యూటీ కేర్‌లో కీ రోల్ పోషిస్తుంది. ఇది టాన్‌ని దూరం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పెదాలపై కొబ్బరినూనె రాయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. పంచదార కూడా స్క్రబ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు పోయి మెరుపు వస్తుంది. మరీ ఎక్కువ పంచదార వేసి రుద్దొద్దు. ఇవి అప్లై చేయడంతో పాటుగాకొన్ని రకాల పనులు మానుకోవడం వల్ల కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.. అవేంటంటే స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే మానేయడం మంచిది.. అలాగే పదేపదే పెదవులను నాలుకతో తడపకూడదు. పెదవులకు ఏవి పడితే అవి లిబ్బామ్ లను అప్లై చేయకూడదు.

  Last Updated: 07 Feb 2024, 01:41 PM IST