Site icon HashtagU Telugu

Hair Tips: ఈ పొడిని కొబ్బరినూనెలో కలిపి రాస్తే చాలు.. పది నిమిషాల్లో మీ తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే!

Hair Tips

Hair Tips

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు 50 ఏళ్లు పై బడిన వారికి మాత్రమే తెల్ల జుట్టు వచ్చేది. కానీ ప్రస్తుత రోజుల్లో పదేళ్ల లోపు పిల్లల నుంచి ఈ తెల్ల జుట్టు సమస్య మొదలవుతోంది. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఆయిల్స్ ని అలాగే షాంపూలను, రకరకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న వయసు వారు కూడా జుట్టుకు రంగును ఉపయోగిస్తున్నారు. అయితే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే.

ఒక నెల రోజులు ఆగిన తర్వాత యధావిధిగా మళ్లీ తెల్ల జుట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే తెల్ల జుట్టు సమస్యకు చక్కటి శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో మునగ ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మునగ ఆకులు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. మునగ ఆకుల్లోని పోషకాలు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో కూడా బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని చెబుతున్నారు.

మునగ ఆకులలో జింక్, విటమిన్ ఏ, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇలా రెడీ చేసుకోండి మునగ ఆకు పొడితో హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా మునగ ఆకును ఎండబెట్టాలి. ఎండిన ఆకులను బాగా రుబ్బుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. రెగ్యులర్ గా ఇలా అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య దరిచేరదు. ఈ రెమిడిని తరచుగా ఫాలో అవ్వడం వల్ల తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. తెల్ల జుట్టు నెమ్మదిగా నల్లగా మారుతుంది.