Site icon HashtagU Telugu

Hair Growth: ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చాలు.. బట్టతలపై కూడా జుట్టు పెరగడం ఖాయం?

Mixcollage 14 Feb 2024 11 56 Am 6278

Mixcollage 14 Feb 2024 11 56 Am 6278

ఈ రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మంది బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ బట్టతల సమస్య కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్న వయసు వారికి ఈ బట్టతల సమస్య మొదలవుతోంది. పురుషులకు ఈ బట్ట తల కారణంగా చాలామందికి పెళ్లిళ్లు కూడా కావడం లేదు. ఇకపోతే బట్టతల సమస్యకు చెక్ పెట్టటానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఫలితం లభించదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముందుగా ఒక నాలుగు ఐదు కరివేపాకు రెబ్బలు తీసుకుని ఆకులను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత అల్యూమినియం మూకుడు తీసుకోవాలి. తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె గాని ఆవనూనెను నువ్వుల నూనెను గాని ఏది ఉంటే దాన్ని 150 నుంచి 200 గ్రాముల ఆయిల్ వేసుకావాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తే ఈ మూకుడుని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మెంతులలో ఉండే బీటా కేరోటిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడం వల్ల డేటా కెరోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక అరగంటకి మంచి పొంగు వస్తుంది. అప్పుడు ఈ మిశ్రమం రంగు బ్రౌన్ కలర్ లోకి వస్తుంది.

ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. లేదా ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేసి గట్టిగా మూటలా కట్టి కాళీ బౌల్లోకి పెట్టుకోవాలి. అప్పుడు ప్యూర్ ఆయిల్ గిన్నెలోకి వస్తుంది. అయితే ఈ ఆయిల్ కలర్ కొంచెం ఆకుపచ్చ పసుపు పచ్చగా ఉంటుంది. మీ జుట్టుకు సరిపడా నూనెను మరో గిన్నెలో వేసుకుని కొంచెం వేడి నీళ్లు కాచుకొని అందులో ఆయిల్ గింజలు ఉంచాలి. అంటే డబల్ బాయిలింగ్ పద్ధతులు ఈ ఆయిల్ వేడి చేసుకోవాలి. అప్పుడు అది గోరువెచ్చగా అవుతుంది. ఆయిల్ అప్లై చేసుకున్నాక గంట లేదా రెండు గంటల పాటు ఉంచుకొని వాష్ చేసుకోవాలి. లేదా రాత్రంతా ఉంచుకున్న ఉదయాన్నే వాష్ చేసుకుంటే ఇంకా బెటర్.