Constipation: రోజు రోజుకి మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. అయితే మలబద్ధకం సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉండగా అందులో ఆహారపు అలవాట్లు జీవనశైలి కూడా ఒకటి. బిజీ లైఫ్ కారణంగా సరిగ్గా తినకపోవడం, తిన్నా సరైన ఫుడ్ తినకపోవడం, తిన్న ఫుడ్ అరగకపోవడం ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మలబద్దకం సమస్య వస్తోంది. ఈసమస్య కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మలవిసర్జన సమయంలో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మలబద్ధకం సమస్య పెరిగిపోయి మలలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి.
అయితే అలా జరగకూడదంటే ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం కివి పండు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కివిలో ఫైబర్, ఆక్టినిడిన్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి రెండు కూడా పేగు కదలికల్ని మెరుగ్గా చేసి మలబద్దకాన్ని తగ్గిస్తాయ. ఇక బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియకి హెల్ప్ చేసి కడుపుని క్లీన్ చేస్తుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది. వీటిని తినడం వల్ల సహజంగానే మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ప్రూనే పండ్లలో కూడా సార్బిటాల్, ఫైబర్స్ ఉంటాయి. ఇవి సహజ బేధిమందులుగా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయట.
ఇందులోని ఫైబర్, సార్బిటాల్ గుణాలు పెద్ద ప్రేగుని క్లీన్ చేస్తాయని, మలాన్ని మృదువుగా చేసి బవెల్ మూమెంట్స్ ని పెంచుతాయని చెబుతున్నారు. రోజూ కొన్ని ప్రూనే పండ్లు తింటూ నీరు ఎక్కువగా తాగడం వల్ల కచ్చితంగా మలబద్ధకం నుంచి బయటపడవచ్చట. అలాగే అవిసెల్లో కరిగే, కరగని ఫైబర్స్ రెండూ ఉంటాయి. ఇవి మలాన్ని సాఫ్ట్ గా చేస్తాయట. దీంతో ఈజీగా మలవిసర్జన జరుగుతుందని, ఇక చియా గింజల్లోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుందని, వీటిని నానబెడితే వాటి పరిమాణం పెరుగుతుందని, దీంతో మలం మృదువుగా మారి కడుపు మొత్తం ఖాళీ అవ్వడానికి హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. కాబట్టి వీటిని తీసుకోవచ్చని, మీరు ఓట్స్‌తో కలిపి తినడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. మలబద్ధకాన్ని తగ్గించడంలో ఓట్స్ కూడా ఎంతో ఏఫిక్టీవ్ గా పని చేస్తాయి. ఓట్స్ లో బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియని ఆరోగ్యంగా చేసి ప్రేగులని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుందట. మలబద్దకంతో బాధపడేవారు ఓట్స్‌ని తరచుగా డైట్ లో చేర్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు. మలబద్దకాన్ని తగ్గించడంలో పాలకూర కూడా బాగా హెల్ప్ చేస్తుందట. పాలకూర లోని మెగ్నీషియం, ఫైబర్స్ పేగులని చురుగ్గా మార్చుతాయని, కడుపుని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తాయని దీనిని మీరు నేరుగా వండుకుని తినవచ్చని చెబుతున్నారు.
Constipation: మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Constipation (2)