Site icon HashtagU Telugu

Weight Loss Recipe : బరువు తగ్గాలనుకున్నా వీలుకావట్లేదా.. డిన్నర్లో ఈ రెసిపీ తింటే కొవ్వు కరగాల్సిందే..

weightloss recipe

weightloss recipe

Weight Loss Recipe: ఊబకాయం.. దాదాపు చాలామంది సమస్య ఇదే. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సిటీ లైఫ్ లో ప్రెస్టేజియస్ గా తింటున్న ఫాస్ట్ ఫుడ్సే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు. గంటలతరబడి కదలకుండా ఒక స్థానంలోనే కూర్చోవడం వల్ల కూడా శరీరం పెరుగుతుంది. ఫలితంగా.. వికృతంగా కనిపిస్తూ.. బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జిమ్ముల్లోకెళ్లి చెమటోడ్చడం, డైటింగ్ పేరుతో ఆకలితో కూర్చోవడం వంటివి చేస్తున్నారు.

ఒకేసారి బరువుతగ్గినా అది ప్రమాదకరమే. అందుకే ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజూ రాత్రి భోజనంలో ఇప్పుడు చెప్పే రెసిపీని ట్రై చేసి చూడండి. ఒక్కవారంలో ఎంతోకొంత మార్పును గమనిస్తారు. ఇది వండుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. చాలా ఈజీ కూడా. ఆ రెసిపీ ఏంటో.. అందుకు ఏయే పదార్థాలు కావాలో చూద్దాం.

వెయిట్ లాస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

టమోటాలు – 2

సన్నగా తరిగిన క్యాబేజీ – 1 కప్పు

క్యాప్సికమ్ – 1

క్యారెట్ – 1

వీటన్నింటినీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

వెయిట్ లాస్ రెసిపీ తయారీ విధానం

ముందుగా కుక్కర్లో నీరుపోసి స్టవ్ పై పెట్టాలి. నీరు వేడయ్యాక ఉల్లిపాయను వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత మిగిలిన కూరగాయల ముక్కల్ని వేసుకోవాలి. అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి కలుపుకుని.. 15 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి.. గోరువెచ్చగా చల్లారబెట్టుకుని తినాలి. ఈ రెసిపీని రోజూ డిన్నర్లో తింటే.. క్రమంగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.

ఇందులోవాడిన కూగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మకాంతి కూడా పెరుగుతుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.