జీవనశైలి మారడం వల్ల చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ ని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే కింద పేర్కొన్న ఈ ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఉసిరి: ఉసిరిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. జుట్టు సమస్యలను కూడా నియంత్రించేందుకు సహాయపడతాయి. దీనికోసం మార్కెట్లో లభించే వీటి పొడిని తీసుకొని.. ఆ పొడిలో టీ స్పూన్ నిమ్మరసం జోడించి మిశ్రమంలా తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేయాలి. 25 నిమిషాల తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి.
మెంతులతో తయారు చేసిన నూనె: మెంతుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి అందుకే వీటిని ఆహారాల్లో వినియోగిస్తారు. జుట్టు రాలకుండా ఉండడానికి తప్పకుండా వీటితో తయారుచేసిన నూనె వినియోగించాలి. అయితే దీనికోసం ముందుగా కొబ్బరి నూనెను తీసుకొని దానిని వేడి చేసి అందులో రెండు స్పూన్ల మెంతి గింజలను వేయాలి. ఆ తర్వాత ఆ నూనెను వడకట్టి రాత్రి పడుకునే ముందు తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.
కొబ్బరి నూనె: కొబ్బరిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి కొబ్బరిని జుట్టు సమస్యలకు కూడా వినియోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టును కుదుళ్ళ నుంచి దృఢంగా చేస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా దీనితో తయారు చేసిన నూనెను వినియోగించవచ్చు.