Site icon HashtagU Telugu

Hair Oil: తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే ఈ ఆయిల్స్ ని ఉపయోగించాల్సిందే?

Mixcollage 30 Jan 2024 01 39 Pm 7485

Mixcollage 30 Jan 2024 01 39 Pm 7485

ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల కారణాల వల్ల హెయిర్ ఫాల్, తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. మళ్లీ కొద్ది రోజులకు తలపై వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అయితే తెల్ల వెంట్రుకల సమస్యకు చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా వాటి వల్ల ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీరు కూడా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఆయిల్స్ ని ఉపయోగిస్తే చాలు.

జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఆముదం బాగా పనిచేస్తుంది. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఇ, ప్రోటీన్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు హైడ్రేట్ చేస్తుంది. మూలాల నుండి జుట్టుని బలంగా చేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకి కూడా హెల్ప్ అవుతుంది. జుట్టు రాలడానికి చుండ్రు కూడా కారణమవుతుంది. ఆముదం రాయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు సమస్యల్ని దూరం చేస్తాయి. ఈ నూనెని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, ఈ ఆయిల్ మందంగా ఉంటుంది. తలకి రాసి క్లీన్ చేసినప్పుడు త్వరగా వదలదు జిడ్డు. దీని వల్ల కొంతమందికి అలర్జీలు కూడా వస్తాయి.

దీనికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె కలిపి పలుచగా చేసి అప్పుడు రాయాలి. ముందుగా జుట్టు కుదుళ్ళకి పట్టి సున్నితంగా మసాజ్ చేయాలి. దీనిని రెగ్యులర్‌గా వాడితే సమస్య దూరమవుతుంది. అలాగే నీల భృంగాడి.. అనేది మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. దీనిని వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారి జుట్టు రాలడం తగ్గి బలంగా పెరుగుతుంది. ఎలా అప్లై చేయాలి అన్న విషయాన్ని వస్తే.. ఈ నూనెని ప్రతి రెండు రోజులకి ఒక సారి రాయాలి. ఇది రాయడం వల్ల కొంతమందికి పడదు. జుట్టు రాలుతుంది. కానీ, రెగ్యులర్‌గా రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే, ఈ నూనె రాసినప్పుడు తలనొప్పిగా ఉంటే దీనిని వాడకపోవడమే మంచిది. దీనిని వాడడం వల్ల కొంతందికి కఫం కూడా వస్తుంది. చాలా మంది జుట్టుకి ఆలివ్ ఆయిల్ మంచిదని వాడతారు. కానీ, దీనిని వాడడం వల్ల చుండ్రు సమస్య వస్తుందని అంటారు. కాబట్టి, దీని వల్ల జుట్టు కూడా రాలుతుంది. అదే విధంగా, మంచిది కదా అని ఎక్కువగా నూనె రాయకూడదు.