Hair Growth: బట్టతల సమస్య రాకుండా ఉండాలి అంటే.. వీటిని తినాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు హెయిర్ ఫాల్ బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 09:35 PM IST

ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు హెయిర్ ఫాల్ బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు పల్చగా అవ్వడంతో పాటు బట్టతల సమస్య కూడా వస్తూ ఉంటుంది. కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలా అనేక కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య వస్తూ ఉంటుంది. జుట్టు రాలడం, చుండ్రు, గజిబిజి జుట్టు, నిర్జీవంగా ఉండే జుట్టు, స్ప్లిట్ ఎండ్స్, తక్కువ జుట్టు సన్నని జుట్టు ఇలా జుట్టుకు సంభందించి అనేక అంతులేని సమస్యలు ఉన్నాయి. ఇలా హెయిర్ కి సంబంధించి ఏదో ఒక సమస్యతో తరచూ బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం తప్పనిసరి. మాములుగా ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది.

జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలాంటి ప్రోటీన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. గుడ్లు లేదా గుడ్డులోని అన్ని అవసరమైన ప్రోటీన్లు, జుట్టును బలోపేతం చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఇది జుట్టులోని నూనెను అలాగే ఉంచుతుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది. కాబట్టి బ్యూటీ సెలూన్‌లకు వెళ్లి మీ జుట్టును జాగ్రత్తగా చూసుకునే బదులు ఇంట్లో గుడ్డుతో మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ జుట్టుకు గుడ్డుతో హెయిర్ మాస్క్ వేస్తే, మీ జుట్టు మెరుగుపడుతుంది. మీ జుట్టు కూడా వృద్ధి చెందుతుంది. గుడ్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వాటిని కురులు మందంగా ఉండటమే కాకుండా బలంగా చేస్తాయి. గుడ్లు ప్రోటీన్ బయోటిన్ పుష్కలంగా ఉంటాయి.

ఈ రెండూ ఆరోగ్యకరమైన జుట్టుకు సూపర్ గా పనిచేస్తాయి. అవోకాడో లో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలు విటమిన్ ఇ వంటివి జుట్టుకు అద్భుతంగా పని చేస్తుంది. ఇది స్ప్లిట్ ఎండ్స్ ని తొలగిస్తుంది. మీ జుట్టు మొత్తం ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది. ఈ పండు జుట్టు పెరుగుదలకు మందానికి అద్భుతమైనది, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో రాగి ఉంటుంది. ఇది జుట్టు ఫోలికల్స్ కలిగి ఉన్న చర్మం కొల్లాజెన్ ఎలాస్టిసినీ పెంచుతుంది. షెల్ ఫిష్, తృణధాన్యాలు, బచ్చలికూర మరియు మేతి, బీన్స్ చిక్కుళ్ళు వంటి ముదురు ఆకు కూరలు కూడా హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. కాబట్టి జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది.

ఇది సెల్యులార్ ఉత్పత్తి, కణ విభజన పెరుగుదలకు కెరాటిన్ అనే ప్రోటీన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. జింక్ జుట్టు రంగును కాపాడటానికి సహాయపడుతుంది. జింక్ చుండ్రును కూడా నివారిస్తుంది, జుట్టు రాలడాన్ని మరింతగా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు జుట్టుకు సూపర్ ఫుడ్. యాంటీఆక్సిడెంట్ జుట్టు కుదుళ్లను దెబ్బతినకుండా కాపాడుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ క్రాన్బెర్రీస్ ఈ బలమైన జ్యుసి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి ఇనుము శోషణకు సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.