జామపండు(Guava) ప్రస్తుతం వర్షాకాలంలో(Rainy Season) బాగా దొరుకుతుంది. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తినాలి. మనకు సీజన్ మారినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు తొందరగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అయితే జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని(Immunity) పెంచుతుంది. దీనివలన తొందరగా ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవకుండా ఉంటారు. రోజూ ఒక జామపండు తినడం వలన మన ఆరోగ్యానికి మంచిది. జామపండును విడిగా తినవచ్చు లేదా జామ్, జెల్లీ, మురబ్బా వంటివి చేసుకొని తినవచ్చు.
* డయాబెటిస్ ఉన్నవారికి జామపండులో ఉన్న పీచు పదార్ధం ఎంతో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
* జామపండులో ఉండే కాపర్ థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది.
* జామపండులో ఉండే విటమిన్ బి 6 , బి 9 , విటమిన్ కె, విటమిన్ ఇ మన శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
* జామపండులో ఉండే పొటాషియం బిపి కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది.
* బరువు తగ్గాలని అనుకునే వారు రోజూ సాయంత్రం ఒక జామకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది.
* జామపండులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీరంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.
* జామపండులో ఉండే ఫైబర్ మనకు మలబద్దకం వంటివి రాకుండా ఉండేలా చేస్తుంది.
* జామపండులో ఉండే విటమిన్ ఎ మన కంటి ఆరోగ్యానికి మంచిది.
* చలికాలంలో జామపండు తినకూడదు అని మన పెద్దవారు చెబుతారు కానీ దానిలో నిజం లేదు. జామపండులో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి చలికాలంలో వచ్చే రొంప, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
Also Read : Mixed Vegitable Curry: మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెసిపీ ఇంట్లోనే ట్రై చేయండిలా?