Site icon HashtagU Telugu

Watermelon Seeds : పుచ్చకాయే కాదు పుచ్చ గింజలు కూడా ఆరోగ్యానికి మంచిదని తెలుసా??

Watermelon Seed

Watermelon Seed

ఎండాకాలం(Summer) వస్తే అందరికి గుర్తొచ్చేది మామిడి పండు(Mango)తో బాటు పుచ్చకాయ(Watermelon) కూడా. పుచ్చకాయ ఎండాకాలంలో మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో పుచ్చకాయని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అంతే కాకుండా మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే పుచ్చకాయలు కాదు పుచ్చ గింజలు(Watermelon Seeds) కూడా ఆరోగ్యానికి మంచివని మీకుతెలుసా?

ఇప్పటికీ కొన్ని ఆయుర్వేద షాపుల్లో పుచ్చ గింజలను, పుచ్చ గింజల పొడిని అమ్ముతూ ఉంటారు. పుచ్చ గింజల్లో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయ గింజలు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇందులో ఎముకలు బలంగా ఉండేందుకు కావాల్సిన క్యాల్షియం కూడా ఉంటుంది. పుచ్చ గింజలు తినడం వలన మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అయితే వీటిని రెండు రకాలుగా తినొచ్చు. పుచ్చ గింజలను నూనె లేకుండా ఒక బౌల్ లో వేయించి, వాటి పొట్టు తీసి డైరెక్ట్ గా తినొచ్చు. అంతే కాక అలా పొట్టు తీసిన పుచ్చ గింజలను మిక్సీ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని స్వీట్స్, పాలల్లో కలుపుకొని తాగొచ్చు. కొన్ని స్వీట్ షాప్స్ వాళ్ళు పుచ్చ గింజలను, పుచ్చ గింజల పొడిని కూడా స్వీట్స్ తయారీలో వాడుతారు.

అలాగే వీటితో టీ కూడా చేసుకొని తాగొచ్చు. పుచ్చ గింజల టీ వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. పుచ్చ గింజలను డైరెక్ట్ గా నీళ్ళల్లో వేసి బాగా మరిగించి ఆ నీళ్ళని వడబోసి తాగొచ్చు. లేదా పుచ్చ గింజలను ఎండలో బాగా ఎండబెట్టి, అనంతరం వాటిని పొడి చేసి ఆ పొడిని నీళ్ళల్లో బాగా మరిగించి, వడపోసి టీలాగా తాగొచ్చు. ఆ పొడి కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలా పుచ్చ గింజల టీ తాగడం వల్ల కండరాల కదలికలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఇకనుంచి పుచ్చకాయతో పాటు పుచ్చ గింజలను కూడా ఆహారంగా అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని పొందండి.

 

Also Read :    Pains while Working : కంప్యూటర్ పనితో ఆ నొప్పులతో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఇలా చేయండి..