Vrikshasana : వృక్షాసనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు..

యోగాసనాలలో ఒక రకమైన వృక్షాసనం చేయడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 10:48 PM IST

యోగా(Yoga) చేయడం వలన మన ఆరోగ్యానికి మంచిది. అయితే యోగాలో ఒక్కొక్క ఆసనానికి ఒక్కో రకమైన ఉపయోగం ఉంటుంది. యోగాసనాలలో ఒక రకమైన వృక్షాసనం చేయడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వృక్షాసనం(Vrikshasana) చెట్టు ఆకారంలో ఉంటుంది. దీనిని ఎలా చేయాలంటే ముందు నిట్టనిలువుగా నించొని కుడి కాలును నెమ్మదిగా వంచి 90 డిగ్రీలు ఉండే విధంగా ఎడమ కాలుపై ఉంచాలి. రెండు చేతులు పైకి లేపి తల పైన నమస్కారం పెట్టాలి లేదా మనకు సమానంగా అయినా నమస్కారం పెట్టవచ్చు. ఇలా చేసి డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. ఈ విధంగా ఉండి పది సార్లు డీప్ బ్రీతింగ్ చేయాలి. తరువాత ఎడమకాలు ను 90 డిగ్రీలు ఉండే విధంగా ఉంచి డీప్ బ్రీతింగ్ పది సార్లు చేయాలి. ఇలా చేయడం వలన బ్యాలెన్స్ పెరుగుతుంది.

ఈ వృక్షాసనం వేయడం వలన కలిగే లాభాలు..

* వృక్షాసనం చేయడం వలన మనలో ఏకాగ్రత పెరుగుతుంది.
* శ్వాస సమస్యలు తగ్గుతాయి.
* మానసికంగా ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి.
* మన కాళ్లల్లో బలం పెరిగి కాళ్ళు బలంగా తయారవుతాయి.
* గుండె సమస్యలు దూరం అవుతాయి.
* రక్తపోటు సమస్యలు తగ్గుతాయి.
* ఈ ఆసనం వేయడం వలన ఆత్మవిస్వాసం పెరుగుతుంది.
* మెడ నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం వేయడం వలన తగ్గుతాయి.
* నిద్రలేమి సమస్యలు ఉన్న ఈ ఆసనం వేయడం వలన తగ్గుతాయి.

మొదటిసారి ఆసనం వేసేవారు గోడను సపోర్ట్ గా తీసుకోవాలి. పాదాలు మోకాలి పైన కాకుండా మోకాలికి కిందకు పెట్టుకోవాలి. ఇంకా ఒకేసారి ఎక్కువ సమయం చేయకూడదు. కొద్ది కొద్దిగా సమయాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.