Single Life : సోలో లైఫే సో బెటరు, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రపంచంలో ఎక్కువ జోకులు ఎవరిమీదున్నాయి అంటే...భార్యభర్తలమీదనే అని చెబుతుంటారు. పెళ్లి జరిగిందంటే చాలు..అసలు జీవితం ప్రారంభం అవుతుంది.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 05:00 PM IST

ప్రపంచంలో ఎక్కువ జోకులు ఎవరిమీదున్నాయి అంటే…భార్యభర్తలమీదనే అని చెబుతుంటారు. పెళ్లి జరిగిందంటే చాలు..అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఇక దాని గురించి చెప్పుకోవాలంటే బోలెడుంది. ఎలాంటి రిలేషన్ షిప్ లేకుండా ఒంటరి లేదా సింగిల్ గా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా. మీ స్నేహితులు మీ పట్ల అసూయపడేలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిజమే కానీ ఒంటరిగా ఉంటే కూడా కొన్ని నష్టాలు ఉండవచ్చు. ప్రయోజనాల గురించి చర్చిస్తే…అవి కూడా తక్కువ కాదు. స్త్రీలు ఒక రిలేషన్ షిప్ లో కి వచ్చిన తర్వాత ఒంటరి జీవితాన్ని కోల్పోతారు. ప్రతినిర్ణయం తమ భాగస్వామిని సంప్రదించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉంటే అస్సలు చింతించకుండా జీవితాన్ని సంతోషంగా గడపండి. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు
స్వీయ సంరక్షణ కోసం సమయం
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ కోసం మీకు బోలేడంత సమయం ఉంటుంది. ఈ సమయాన్నివస్త్రధారణ, ఫిట్‌నెస్, నెట్‌వర్కింగ్ వంటి వాటికోసం ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

తక్కువ ఒత్తిడి
వివాహితుల కంటే ఒంటరి వ్యక్తులకు తక్కువ బాధ్యత తక్కువగా ఉంటుంది. కుటుంబం బాధ్యతలు స్వీకరించినా…వివాహాం తర్వాత స్త్రీ పురుషుడు భరించాల్సిన ఒత్తిడి అస్సలు ఉండదు. దీంతో మీ జీవితాన్ని మంచి మార్గంలో ప్లాన్ చేసుకుంటారు. ఒత్తిడికి దూరంగా ఉంటారు.

మంచి నిద్ర
మంచి నిద్రపోవాలంటే వివాహితుల్లో ఈ నిశ్చయత కనిపించదు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే…మంచి నిద్రను ఆస్వాదించగలరు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

కెరీర్‌పై ఎక్కువ దృష్టి
ఒంటరిగా ఉండే మహిళలు తమ కెరీర్‌పై బాగా దృష్టి పెడతారు. ఆమె దృష్టంతా తన ఉద్యోగంపైనే ఉంటది. తన పనిని షెడ్యూల్ చేసుకోగలుగుతుంది. ఎక్కువ గంటలు పని చేయడానికి ఇతరుల వలే ప్రణాళిక రూపొందించుకోవల్సిన పనిలేదు. అందరికంటే ముందుగానే లక్ష్యాలను సాధించగలుగుతారు.

జీవితంలో సరదాగా
ఒంటరి వ్యక్తులు తమ కుటుంబం లేదా పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్లచ్చు.