Site icon HashtagU Telugu

Rose Water: ప్రతీ రోజూ రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Rose Water

Rose Water

అందానికి ఉపయోగించే వాటిలో రోజ్ వాటర్ కూడా ఒకటి. మార్కెట్లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్ లలో ఈ రోజ్ వాటర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని వృదువుగా చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా ఇవి తగ్గించడానికి ఎంతో బాగా సహాయపడతాయి. అంతేకాదు ఇది ముఖంపై ఉండే నల్ల మచ్చలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

అయితే నిజానికి రోజ్ వాటర్ ను ఎలాంటి చర్మం ఉన్నవారైనా ఉపయోగించవచ్చట. ఇది చర్మం పీహెచ్ సమతుల్యతను కాపాడటమే కాకుండా ముఖం జిడ్డును నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే మొటిమలను రాకుండా చేయడానికి, ఉన్న మొటిమలను తగ్గించడానికి అలాగే ముఖంపై నల్ల మచ్చలను తొలగించడానికి రోజ్ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని, ఇందుకోసం రోజ్ వాటర్ లో ముంచిన దూదితో మీ ముఖాన్ని తుడుచుకోవాలని చెబుతున్నారు. రోజ్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయట. మొటిమలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన చెమట, మురికిని తొలగించడానికి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగ పడుతుందట.

అయితే ఇందుకోసం రాత్రిపూట ముఖాన్ని కడిగిన తర్వాతే రోజ్ వాటర్ ను అప్లై చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను తొలగించడానికి కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది. ఇందుకోసం ఫ్రిజ్ లో రోజ్ వాటర్ ను పెట్టాలి. తర్వాత కాటన్ ను చల్లటి రోజ్ వాటర్ లో ముంచాలి. తర్వాత ఈ కాటన్ ను మీ కళ్ల పైన కాసేపు ఉంచాలి. ఇది కళ్ల కింది భాగంలో నల్లని మచ్చలను తొలగించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మ రంగు మెరుగుపడుతుందట. రోజ్ వాటర్ అనేది ఒక సహజ పదార్ధం. ఇది మేకప్ రిమూవర్ లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చట. ఇవి మేకప్ ను చాలా సులభంగా తొలగించడానికి సహాయపడతుందని చెబుతున్నారు.