Chess Game : చెస్ ఆడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

చెస్ ఆట ఆడటానికి ఏకాగ్రత, చురుకుదనం, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఆటలో గెలవాలి అంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలియాలి.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 09:19 PM IST

ప్రజలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో చదరంగం(Chess) ఒకటి. “జీవితమే ఒక చదరంగం” అని అంటూ ఉంటారు అదే నిజం. ఈ చెస్ అనేది ఇద్దరు కలిసి ఆడుకునే ఆట. ప్రపంచంలో ఎక్కువమంది ఇండోర్ లో ఆడే ఆట చెస్ మాత్రమే.

చదరంగం మన భారతదేశంలోనే పుట్టింది. గుప్తుల కాలంలో ఉత్తర భారత ఉపఖండంలో ఆడిన చతురంగ ఆటలో భాగంగానే ఈ చెస్ పుట్టింది. వివిధ దేశాల మధ్య వాణిజ్యం ప్రారంభమైనప్పుడు వర్తకుల ద్వారా భారతఖండం నుండి అనేక దేశాలకు ఈ చెస్ వ్యాప్తి చెందింది. ప్రతి సంవత్సరం జులై 20న అంతర్జాతీయ చదరంగ దినోత్సవం కూడా జరుపుకుంటారు.

చెస్ ఆట ఆడటానికి ఏకాగ్రత, చురుకుదనం, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఆటలో గెలవాలి అంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలియాలి. ఈ ఆట ఆడడం వలన మన మెదడు చురుకుదనం పెరుగుతుంది. చెస్ ఆడడం వలన I Q పెరుగుతుంది. మనలో సృజనాత్మకత పెరుగుతుంది. మనలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఒత్తిడిలోనూ మన మెదడు మెరుగ్గా, చురుకుగా పనిచేస్తుంది. ఆత్మవిస్వాసం మనలో పెరుగుతుంది. ఈ ఆట ఆడడం వలన మన జీవితంలో గెలుపు, ఓటమి వంటివి సహజమే అని తెలుసుకుంటారు. మానసికంగా కూడా చురుకుగా తయారవుతారు. చెస్ ఆడడం వలన పిల్లలు కూడా యాక్టివ్ గా ఉంటారు. ఉల్లాసంగా కూడా ఉంటారు.

 

Also Read : Fire boltt gladiator plus: మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర,ఫీచర్స్ ఇవే?