Neem Leaves: వామ్మో.. వేపాకు వల్ల అందానికి ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

వేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో ఔషద గుణాలు కలిగిన వేప ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే

Published By: HashtagU Telugu Desk
Mixcollage 22 Feb 2024 09 21 Pm 2180

Mixcollage 22 Feb 2024 09 21 Pm 2180

వేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో ఔషద గుణాలు కలిగిన వేప ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ముఖ్యంగా వేప ఆకులు క్రిమీ నాశకాలుగా పనిచేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వేప కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించడానికే కాదు. అందాన్ని సంరక్షించేందుకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వేపాకును ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్లలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే కెమికల్ బ్యూటీ ప్రోడక్ట్లకు బదులుగా వేప ఆకును ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

మరి వేప ఆకుతో బ్యూటీని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేపలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతాయి. వేప మొటిమల చికిత్స, నివారణకు సహాయపడుతుంది. చర్మంలో జిడ్డు ఉత్పత్తిని నివరించేందుకు కూడా వేప ఉపయోగపడుతుంది. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చర్మాన్ని సున్నితంగా ఉంచేందుకు కూడా వేప ఉపయోగపడుతుంది. పొడి చర్మం నుంచి కూడా వేప ఉపశమనం కలిగిస్తుంది. వేపలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ ట్రైగ్లిజరైడ్స్, విటమిన్ ఈ వృద్ధాప్యాన్ని నివరిస్తాయి.

చర్మంపై ఉండే ముడతలు, ముదురు మచ్చలను వేప తగ్గిస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. ముఖం మీద ఏర్పడే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌ నివారణకు కూడా వేప ఉపయోగపడుతుంది. చర్మంలోని మలినాలను బయటకు పంపి, రంధ్రాలను పూడ్చేందుకు ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును నివారిస్తాయి. చుండ్రు వల్ల కలిగే దురద, మంట, చికాకు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వేపలోని పునరుత్పత్తి లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వేప నూనెతో తలకు చేస్తే.. రక్త ప్రసరణ పెరుగి జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది. వేపలోని లినోలెయిక్, ఒలేయిక్, స్టెరిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషకాలను అందిస్తాయి.

  Last Updated: 22 Feb 2024, 09:21 PM IST