Site icon HashtagU Telugu

Multani Mitti: ముల్తానీ మట్టిని చర్మానికి ఉపయోగించడం మంచిదేనా?

Multani Mitti

Multani Mitti

అందంగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేసేవారు ఎక్కువగా ముల్తానీ మట్టిని ఉపయోగిస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ ముల్తానీ మట్టిని చాలా రకాల బ్యూటీ ప్రోడక్ట్ లో ఉపయోగిస్తూ ఉంటారు. చర్మానికి మేలు చేసే ఈ మట్టి లేనిదే బ్యూటీ ప్రొడక్ట్సే లేవు. ఎలాంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన మట్టిలో ఉండే సహజ ఖనిజాలే. ఈ మట్టి చర్మానికి రక్షణ కలిగిస్తుంది. అయితే మరి ముల్తానీ మట్టిని ముఖానికి ఉపయోగించవచ్చా లేదా ఒకవేళ ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం..

ముల్తానీ మట్టిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మట్టి ఎక్కువగా ఫౌడర్ రూపంలోనే లభిస్తుంది. తెలుగు, నీలం, ఆకుపచ్చ, గోదుమ రంగుల్లో ఎక్కువగా లభిస్తుంది. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ముల్తానీ మట్టి ఒక వరం అని చెప్పవచ్చు. సాధారణంగా మట్టికి పీల్చే గుణం ఎక్కువ. అందుకే, ముల్తానీ మట్టిని ముఖానికి రాయగానే ముందుగానే చర్మాన్ని జిడ్డులా మార్చే నూనెలను పీల్చేస్తుంది. చర్మ రంథ్రాల్లో క్లాగ్ లేకుండా చూస్తుంది. చర్మం పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అందుకే, ఎక్కువ మంది దీన్ని ఫేస్‌ప్యాక్‌గా వినియోగిస్తారు. చర్మంపై మచ్చలను తొలగించేందుకు ఇది మంచి ఔషదం.

మొటిమలను తొలగించడంలో ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై జిడ్డుగారే నూనెల వల్ల మొటిమలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. ముల్తానీ మట్టిని ముఖానికి రాసినట్లయితే జిడ్డు మాయం అవుతుంది. అలాగే, మొటిమల వల్ల ముఖంపై ఏర్పడు గుంటలను కూడా తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఈ మట్టిని చర్మానికి పూసుకోవడం ద్వారా రంగు మారుతుంది. డార్క్ స్కిన్‌తో బాధపడేవారికి ఇది ఉపయోగపడుతుంది. మరీ తెల్లగా మార్చుకున్నా చర్మాన్ని కాంతివంతంగా కనిపించేందుకు సహకరిస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. కాబట్టి ముల్తాని మట్టిని ఉపయోగించేవారు ఎటువంటి భయాలు, ఆందోళన లేకుండా మట్టిని ఉపయోగించవచ్చుmn