ముల్తానీ మట్టి(Multani Mitti).. అందంకోసం పరితపించేవారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది లేనిదే చాలారకాల బ్యూటీ ప్రొడక్ట్సే (Beauty Products)లేవు. పాకిస్థాన్(Pakisthan) లోని ముల్తాన్ ప్రాంతంలో లభించే ఈ మట్టిలో చర్మానికి మేలు చేసే ఎన్నోరకాల ఖనిజాలున్నాయట. అందుకే దీనిని ముల్తానీ మట్టి అని పిలుస్తారు. మరి దీనివల్ల చర్మానికి కలిగి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
మార్కెట్లలో చాలా రకాల పేర్లతో, ఫ్లేవర్లతో ముల్తానీ మట్టిని అమ్ముతున్నారు. కానీ బ్రాండెడ్ ముల్తానీ మట్టిని వాడటమే మంచిది. ఇందులో మెగ్నీషియం, క్వార్ట్స్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మట్టి ఎక్కువగా తెలుపు, గోధుమ రంగుల్లో లభిస్తుంది. చర్మం, జుట్టు సంబంధిత సమస్యలకు ముల్తానీ మట్టి చక్కటి పరిష్కారం.
సాధారణంగా మట్టికి పీల్చే గుణం ఎక్కువ. అందుకే ముల్తానీ మట్టిని ముఖానికి రాయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డులా మార్చే నూనెలను పీల్చుకుని రంధ్రాల్లో క్లాగ్ లేకుండా చేస్తుంది. పీహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంటుంది. అలాగే మచ్చలను కూడా ఈ ఫేస్ ప్యాక్ తొలగిస్తుంది.
ముఖంపై ఏర్పడే మొటిమలను, వాటివల్ల ఏర్పడే మచ్చలను తొలగించడంలో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ముఖంపై ఏర్పడిన గుంటలను కూడా తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
ఎండవల్ల చర్మంపై టాన్ పేరుకుపోయిన వారికి ముల్తానీ మట్టి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ముఖం, మెడ, చేతులకు ప్రతిరోజూ ముల్తానీ మట్టిని రాసి.. అది ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న టాన్ తొలగిపోయి మెరుస్తుంది. చర్మంపై మృత కణాలను తొలగించి కాంతివంతంగా ఉంచుతుంది.
తలలో చుండ్రు సమస్యతో బాధపడేవారు కూడా ముల్తానీ మట్టిని వాడొచ్చు. తలకు ముల్తానీమట్టి ప్యాక్ ను వేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. చుండ్రు ఏర్పడేందుకు కారణమయ్యే గ్రీజు, ధూళిని ఇది తొలగిస్తుంది. జుట్టు చిట్లకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.
Also Read : Milk: వామ్మో.. పాలు తాగడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?