Health Tips: పరగడుపున నీళ్లు,అరటిపండు కలిపి తీసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

పరగడుపున వేడి నీరు, అరటిపండు రెండు కలిపి తీసుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇకపోతే చాలామంది ఉదయాన్నే చాలా రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటే మరి కొందరు వాము వాటర్ ఇంకొందరు జ్యూస్లు తాగుతూ ఉంటారు. ఇంకొందరు అరటి పండ్లు పాలు కలిపి తింటూ ఉంటారు. మరి ఇలా తీసుకోవచ్చా? ఇలా తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే అరటిపండు తిన్న తర్వాత గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఊబకాయం సమస్య తగ్గుతుందట.

అంతేకాకుండా ప్రొద్దున్న వేడి నీరు తాగడం వలన మనిషి ఏకాగ్రత శారీరక పనితీరు రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చట.అలాగే పొద్దున్న నీరు తాగితే ఒత్తిడి కూడా తగ్గుతుందట. మలబద్ధకంతో బాధపడేవారు పొద్దున్నే అరటిపండు తిని వెంటనే వేడి నీరు తాగితే మనం తిన్న ఆహారం బాగా జీర్ణమై మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చట. అలాగే పొద్దున్న అరటిపండు తినడం వల్ల సోడియం స్థాయి సమతుల్యతతో ఉంటుంది అందువలన రక్తపోటుని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. మీకు బాగా అలసటగా అనిపించినప్పుడు ప్రతిరోజు ప్రొద్దున్న ఒక అరటిపండు తినాలనీ చెబుతున్నారు.

అలాగే వేడి నీరు శరీరంలోని టాక్సిన్స్ విసర్జనను ప్రేరేపిస్తుంది. అరటి పండు లోని కాల్షియం విటమిన్ సి విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి ఇవి కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా పరగడుపున అరటిపండు తిని వేడి నీరు తాగవచ్చట. అయితే కొన్ని రకాల డైజెస్టివ్ సిస్టం తో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను తీసుకునే ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ముందుగా నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత వాటి తినడం తాగడం చేయాలని చెబుతున్నారు.

  Last Updated: 05 Dec 2024, 12:17 PM IST