Cardamom: యాలకుల వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సహజ ఔషధంగా చేస్తాయట. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఉదయం ఖాళీ కడుపుతో 1 నుండి 2 ఆకుపచ్చ యాలకులు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనిని సహజ ఔషధంగా చేస్తాయట.
ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. పరగడుపునే మహిళలు రెండు యాలకులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా ల్యూకోరియా సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని, శక్తి పెరుగుతుంది బలహీనత తగ్గుతుందని చెబుతున్నారు. కాగా యాలకులు గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయట. రోజూ ఉదయం దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుందట. పొట్ట కూడా శుభ్రం అవుతుందని చెబుతున్నారు.
యాలకులలో పొటాషియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయట. బీపీ రోగులకు ఉదయం ఖాళీ కడుపుతో ఏలకులు తినడం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటుందని చెబుతున్నారు. తరచుగా ఒత్తిడి, అలసట లేదా చికాకు అనిపిస్తే యాలకులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుందని, దీన్ని తినడం వల్ల మూడ్ తాజాగా ఉంటుందని రోజంతా శక్తి ఉంటుందని చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో యాలకులను నమలడం వల్ల, దానిలోని యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయని చెబుతున్నారు. పరగడుపునే ఖాళీ కడుపుతో యాలకులను నమలడం వల్ల నోటిని శుభ్రపరచడానికి సహాయపడుతుందట. దీనివల్ల నోటి దుర్వాసన రాదని చెబుతున్నారు. అందుకే వీటిని సహజమైన మౌత్ ఫ్రెషనర్ అని కూడా పిలుస్తారు. ఏలకులను నమలడం వల్ల దంతాలపై స్క్రబ్ లాగా పనిచేస్తుందట. ఇది పసుపు రంగును తగ్గిస్తుందట. ఖాళీ కడుపుతో ఏలకులను నమలడం వల్ల దంతాలు సహజంగా శుభ్రంగా ఉంటాయి మెరుపు వస్తుందని చెబుతున్నారు.
Cardamom: పరగడుపున 2 యాలకులు తింటే చాలు.. కలిగే లాభాలు అస్సలు నమ్మలేరు!

Cardamom