Copper And Water: రాగి పాత్ర‌లో నీళ్ళు తాగుతున్నారా..? ఈ విషయం తెలుసుకోండి..!!

ప్రస్తుత రోజులన్నీ కూడా ప్లాస్టిక్ తో ముడిపడి ఉన్నాయి. ఏది తిన్నాలన్నా....తాగాలన్నా ప్లాస్టిక్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం.

Published By: HashtagU Telugu Desk
Copper Vessel

Copper Vessels

ప్రస్తుత రోజులన్నీ కూడా ప్లాస్టిక్ తో ముడిపడి ఉన్నాయి. ఏది తిన్నాలన్నా….తాగాలన్నా ప్లాస్టిక్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. పూర్వకాలములో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే ఉపయోగించేవారు. ఆయుర్వేదం ప్రకారం రాగిపాత్రల్లో నిల్వచేసిన నీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగికి యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశమే ఉండదు. కాబట్టి ఇందులో ఉన్న పదార్థాలు చెడిపోయే అవకశం తక్కువగా ఉంటుంది.

రాగి చెంబులో నీళ్లు నిలువ చేసి పరకడుపున తాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. రాగి పాత్రలలో వండి పంటలను తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతోపాటు మెదడు శక్తివంతంగా తయారవుతుంది. రాగిపాత్రలను నిత్యం ఉపయోగించడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకల బలంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.

రాగిపాత్రల్లో నీళ్లు తాగడం వల్ల ఊబకాయం, మలబద్ధకం, గుండెపోటు వంటి సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. రాగి కడియం ధరించినట్లయితే శరీరంలోని వేడిని తగ్గించి బీపీ కొలెస్ట్రాల్ ను అరికడుతుంది. ప్రతిరోజూ ఉదయం రెగ్యులర్ గా రాగిపాత్రలో నీరు తాగడం వల్ల మొటిమలు లేని చర్మాన్ని పొందవచ్చు. చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, వయస్సు పెరిగినట్లు కనిపించడం వంటి సమస్యలను కూడా దరిచేరనివ్వకుండా సహాయపడుతుంది.

  Last Updated: 03 Jun 2022, 12:13 AM IST