Tulsi Water: తులసి వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా తులసి నీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మరి తులసి నీటి వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్షాకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి చాలా సమస్యలు వస్తుంటాయి. సమస్య వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే, ఆ ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
అలా చేయడంలో తులసి నీరు బాగా పని చేస్తుందట. ఒక గ్లాసు నీటిలో 7 నుంచి 10 తాజా తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. నీరు సగం వరకు మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇందులో మీరు కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపితే రుచి బాగుంటుందట. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్ లు వేగంగా వ్యాపిస్తాయి. తులసి నీటిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మన శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయట. ప్రతిరోజూ ఉదయం ఈ తులసి నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. కాగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడంతో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తులసి నీరు సహజంగా ఊపిరితిత్తుల్లోని కఫాన్ని కరిగించి, శ్వాసనాళాలను శుభ్రంగా ఉంచుతుందట.
 ఇది ఆస్తమా లేదా అలర్జీతో బాధపడే వారికి కూడా ఉపశమనం ఇస్తుందని చెబుతున్నారు. తులసి నీరు జీర్ణవ్యవస్థను బలపరుస్తుందట. పరగడుపున తాగడం వల్ల ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయట. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తులసి నీరు అద్భుత పరిష్కారంగా పని చేస్తుందట. అదేవిధంగా తులసి ఆకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయట. ఇది రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుందట. ప్రతిరోజూ ఉదయం తులసి నీరు తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుందట. మొటిమలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
తులసి సహజంగా మన నరాల వ్యవస్థను శాంతపరుస్తుందట. గోరువెచ్చని తులసి నీరు ఉదయం తాగడం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
Tulsi Water: ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Tulsi Water
