Diary Writing : డైరీ రాయడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా?

డైరీ రాసే అలవాటు(Diary Writing) ఉండడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Benefits of Diary Writing Must write Diary

Benefits of Diary Writing Must write Diary

మనం అందరం ప్రతి విషయాన్ని ఇప్పుడు ఫోన్లలో(Phones) రాసుకుంటున్నాము, సేవ్ చేసుకుంటున్నాము. కానీ ఇదివరకు రోజుల్లో ఏ విషయమైనా డైరీలో(Diary) రాసుకునేవారు. డైరీ రాసే అలవాటు(Diary Writing) ఉండడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డైరీ రాయడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మనలో చాలామంది నిద్రలో వచ్చిన కలలను మర్చిపోతుంటాము. కానీ డైరీ రాసే అలవాటు ఉన్నవారు నిద్రలో వచ్చిన కలలను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. డైరీ రాయడం వలన మనం చేసిన పనుల్లో ఏమైనా లోపాలు ఉన్న సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన వస్తుంది.

మన అలవాట్లను కూడా మార్చుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. అంటే మనలో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు రావడానికి సహకరిస్తుంది. డైరీ రాయడం వలన మనలోని భావోద్వేగాలు అనేవి కంట్రోల్ అవుతాయి. మనం ఏదయినా విషయం గురించి ఎక్కువగా ఆలోచించినట్లయితే డైరీలో రాసుకుంటే ఆలోచన కొంత తగ్గుతుంది కావున మనసు తేలిక పడుతుంది.

ఈ మధ్యకాలంలో ఎవరైనా ఎక్కువ సేపు ఫోన్లలో సమయాన్ని గడుపుతున్నారు. దాని వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలా కాకుండా డైరీ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డైరీలో మనకు నచ్చినవి, నచ్చనివి రాసుకోవడం వలన మనకు ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం ఎక్కువగా రాత్రి పూట పడుకునే ముందు డైరీ రాసుకోవాలి అనుకుంటూ ఉంటాము. కానీ డైరీ రాసుకోవాలి అని అనుకుంటే మనం సాయంత్రం సమయంలో రాసుకుంటే మంచిదట. డైరీ రాయడం వలన మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత తీసి చదువుకుంటే జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మనసు ఆనందంగా కూడా ఉంటుంది.

 

Also Read : Pet Dog : కుక్కను పెంచుకోవడం వలన కాపలా ఒకటే కాదు.. ఎన్నో ప్రయోజనాలు..

  Last Updated: 25 Oct 2023, 09:06 PM IST