Site icon HashtagU Telugu

Hair Fall: కొబ్బరి నూనె మాత్రమే కాదు.. కొబ్బరి నీరు కూడా హెయిర్ ఫాల్ ని ఆపుతాయని తెలుసా?

Hair Fall

Hair Fall

ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ హెయిర్ ఫాల్ ను అరికట్టడం కోసం రకరకాల క్రీములు షాంపూలు ఆయిల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మంది కొబ్బరి నూనె ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా కొబ్బరి నూనె మాత్రమే కాకుండా కొబ్బరి నీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుందట. మరి మరి నీటితో హెయిర్ ఫాల్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కొబ్బరి నీటిని తాగితే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చర్మం తేమగా ఉంటుంది.

ఈ నీళ్లు మన శరీరంలో వాటర్ లోపాన్ని పోగొడుతాయట. అంతేకాదు ఈ కొబ్బరి నీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయట. అలాగే మీకు పోషణను కూడా ఇస్తాయట. అందుకే కొబ్బరి నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లు మన శరీర ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును కొబ్బరి నీళ్లను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది. చుండ్రు తగ్గిపోతాయి. అంతేకాదు మీ జుట్టు సిల్కీగా మారుతుందట. కాగా కొబ్బరి నీటిలో 94 నుంచి 96 శాతం నీరు ఉంటుంది. అలాగే ఈ వాటర్ లో ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ సి లు కొబ్బరి నీటిలో పుష్కలంగా ఉంటాయి.

కొబ్బరి నీటిని తాగడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుందట. అలాగే మన శరీరానికి అవసరమైన పొటాషియం కూడా అందుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందట. మన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట. ఈ వాటర్ చర్మం, జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం జుట్టు పెరిగేందుకు సహాయపడుతుందట. అలాగే కొత్త జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఇది జుట్టును బలోపేతం చేస్తుందట. అలాగే జుట్టు రాలే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

అలాగే కొబ్బరి నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మీ నెత్తిని తేమగా ఉంచుతుందట. కొబ్బరి నీటిలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అలాగే నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తాయని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. ఫోలిక్ ఆమ్లం అనేది ఒక రకమైన బి విటమిన్. ఇది మన జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.ఈ ఫోలిక్ యాసిడ్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఇది జుట్టు రాలడాన్ని బాగా తగ్గిస్తుందట. కొబ్బరి నీళ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్ మీకు బట్టతల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.