మామూలుగా చాలా మంది ఆహారం తినేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిలో స్పీడ్ గా తినడం ఒకటి అయితే ఆహారాన్ని నమలకుండా తినడం మరొకటి అని చెప్పాలి. చాలామంది వివిధ కారణాల వల్ల ఆహారాన్ని తొందరగా ముగించేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన జీర్ణక్రియ విధులకు అంతరాయం కలిగితే అది మన మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా జీర్ణసమస్యలు వస్తాయట. ఆహారాన్ని సరిగ్గా నమిలినప్పుడు అది నోటిలోనే విచ్ఛిన్నమవుతుంది. దీనివల్ల లోపలికి వెళ్లిన ఆహారం సులభంగా జీర్ణం అవుతుందట. ఆహారం నోటిలో విచ్ఛిన్నమైన తర్వాత శరీరం దాని నుంచి పోషకాలను త్వరగా గ్రహించగలుగుతుంది. కాబట్టి మనం తినే ఆహారం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. చాలామంది టీవీలు ఫోన్లు చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. వీటిని చూస్తూ తింటే భోజనం త్వరగా అయిపోతుంది. కానీ వీళ్లు అతిగా తినే అవకాశం ఉంది. అయితే మీరు ఆహారాన్ని బాగా నమిలి తింటే మీరు అతిగా తినరు.
ఇది బరువు పెరగకుండా ఉండటానికి, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా టీవీ, మొబైల్ ఫోన్ లు భోజనం చేసేవారు సరిగ్గా నమలకుండా అలాగే మింగేస్తూ ఉంటారు. ఆహారాన్ని చాలా నెమ్మదిగా తినడం, నమలడం వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి చేరవని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. బరువు పెరగకుండా ఉంటారని చెబుతున్నారు. సహజంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు చాలా మందే ఉన్నారు. వీరికి తిన్న తర్వాత కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఆహారాన్ని నమలడం, నెమ్మదిగా తినడం వల్ల ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవట.