Site icon HashtagU Telugu

Beet Root: బీట్ రూట్ తో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే ముఖంపై ముడతలు మాయం!

Beet Root

Beet Root

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బీట్ రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే బీట్రూట్ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందరికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ ను ఉపయోగించి ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గించుకోవచ్చు.

దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ చర్మం సహజ మెరుపును పునరుద్ధరించడానికి, డల్ స్కిన్ టోన్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుందట. అయితే ఇందుకోసం ఇందుకోసం బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగవచ్చు. బీట్ రూట్ చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే కూరల రూపంలో కూడా తీసుకోవచ్చు. కాగా బీట్ రూట్ మొటిమల వల్ల కలిగే మచ్చలు, ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి చర్మంపై అదనపు నూనెను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలు, డ్రైనెస్ ను నివారిస్తుంది. బీట్ రూట్ లో బీటాలైన్స్ అనే వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంటే బీట్ రూట్ మొటిమల దురద, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుందట. బీట్ రూట్ లోని విటమిన్ సి మెలనిన్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ముదురు, రంగు మారిన పెదవులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ లోని విటమిన్ సి వృద్ధాప్యపు తొలి సంకేతాల నుంచి చర్మాన్ని కాపాడుతుందట.

కాగా రెండు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలిపి ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలను తగ్గిపోతాయట. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుందట. బీట్ రూట్ ను ఉడికించిన తర్వాత చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. బీట్ రూట్ లో ఐరన్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి. ఈ విధంగా ఫేస్ ప్యాక్ ట్రై చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు.