Beauty Tips: ముఖంపై ముడతలు మాయం అవ్వాలి అంటే బీట్రూట్ తో ఇలా చేయాల్సిందే!

ముఖంపై ముడతలు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల బ్యూటీ టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Beauty Tips

Beauty Tips

బీట్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కాగా ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ ను ఉపయోగించి ముఖంపై ముడతలు, నల్ల మచ్చలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చు.

కాగా బీట్ రూట్ చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మొటిమల వల్ల కలిగే మచ్చలు, ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి కూడా బీట్ రూట్ సహాయపడుతుందట. అలాగే బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై అదనపు నూనెను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలు, డ్రైనెస్ ను కూడా నివారిస్తుంది. బీట్ రూట్ లో బీటాలైన్స్ అనే వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బీట్ రూట్ మొటిమల దురద, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుందట.

బీట్ రూట్ లోని విటమిన్ సి మెలనిన్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ముదురు రంగు మారిన పెదవులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుందట. బీట్ రూట్ లోని విటమిన్ సి వృద్ధాప్యపు తొలి సంకేతాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అయితే బీట్రూట్ ని ఉపయోగించి మన చర్మంపై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలపి ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలను తగ్గిపోతాయి. చర్మం కూడా కాంతివంతంగా మారుతుందట. అదేవిధంగా బీట్ రూట్ ను ఉడికించిన తర్వాత చర్మానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. బీట్ రూట్ లో ఐరన్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే స్కిన్ టోన్ ను కూడా మెరుగుపరుస్తాయట.

  Last Updated: 16 Dec 2024, 03:39 PM IST